Google pay vs Phone pe: యూపీఐ మార్కెట్ పెత్తనం వీటిదే..అగ్రస్థానంలో ఫోన్‌పే

Google pay vs Phone pe:  ‌ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్స్  మధ్య పోటీ నెలకొందిప్పుడు. ముందొచ్చిన గూగుల్‌పేను దాటి వెళ్లిపోయింది వెనుకొచ్చిన ఫోన్‌పే. లావాదేవీల్లో రికార్డు సృష్టిస్తోంది.

Last Updated : Jan 20, 2021, 03:08 PM IST
Google pay vs Phone pe: యూపీఐ మార్కెట్ పెత్తనం వీటిదే..అగ్రస్థానంలో ఫోన్‌పే

Google pay vs Phone pe:  ‌ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్స్  మధ్య పోటీ నెలకొందిప్పుడు. ముందొచ్చిన గూగుల్‌పేను దాటి వెళ్లిపోయింది వెనుకొచ్చిన ఫోన్‌పే. లావాదేవీల్లో రికార్డు సృష్టిస్తోంది.

యూపీఐ మార్కెట్లో చాలా సంస్థలు పరస్పరం పోటీ పడుతున్నాయి. గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్, పేటీఎం ఇలా చాలానే ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవల్సింది గూగుల్‌పే, ఫోన్‌పే యాప్‌ల గురించి. యూపీఐ మార్కెట్‌లో ఇవే పోడీ పడుతున్నాయి. క్షణాల్లో నగదు బదిలీ అవడం, క్యాష్ రివార్డులు ఇస్తుండటంతో ప్రజలు వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఆన్‌లైన్ పేమెంట్లు ( Online payments ) పెరిగిపోయాయి.

ఫోన్‌పే యాప్ ద్వారా ఒక్క డిసెంబర్ నెలలోనే 1.82 లక్షల కోట్ల విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. అటు గూగుల్‌పే  ( Google pay ) ద్వారా 1.76 లక్షల కోట్ల విలువైన 854.49 మిలియన్ లావాదేవీలు జరిగాయి. అంటే యూపిఐ లావాదేవీల్లో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న గూగుల్‌పేను తలదన్ని.. ఫోన్‌పే అగ్రస్థానంలో నిలిచిందని తెలుస్తోంది.  

మార్కెట్‌లో ఇప్పుడు ఈ రెండు యాప్‌లే ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. డిసెంబర్‌లో జరిగిన మొత్తం యుపిఐ లావాదేవీల్లో 78 శాతం, లావాదేవీల విలువలో 86 శాతం ఫోన్‌పే, గూగుల్‌‌పే ద్వారానే జరిగాయని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ ప్రొవైడర్ 3 వేల 508 కోట్ల విలువైన లావాదేవీల్ని నిర్వహించింది. 

Also read: Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం.. అదిరిపోయే ఆఫర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News