భూకంపాలు (Earthquakes) అకస్మాత్తుగా సంభవించి భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలగజేస్తుంటాయి. అయితే దీనిపై గూగుల్ (Google) శుభవార్త చెప్పింది. భూకంపాలను ముందుగానే గుర్తించేలా ఆండ్రాయిడ్ ఎర్త్‌కేక్ డిటెక్షన్ (Android-based earthquake detection feature) ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు వెల్లడించింది. మంగళవారం ఈ ఫీచర్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో లాంచ్ చేసిన ఈ సేవలు కొన్ని నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. Sara Ali Khan Birthday Special: సారా అలీ ఖాన్ బర్త్‌డే స్పెషల్ గ్యాలరీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఈరోజు ప్రారంభించాం. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆండ్రాయిడ్ ఎర్త్‌కేక్ అలర్ట్ సిస్టమ్‌లో మీరు ఉంటారు. మీ ఆండ్రాయిడ్ ఫోన్ మినీసిస్మోమీటర్‌గా పనిచేయనుంది. ప్రపంచంలోని కొన్ని మిలియన్ల ఆండ్రాయిడ్ మొబైల్స్ ప్రపంచంలోని అతిపెద్ద భూకంపాన్ని సూచించే నెట్‌వర్క్‌లో చేరిపోయారని’ గూగుల్ తమ బ్లాగ్‌లో మంగళవారం పేర్కొంది. Sputnik V‌: రష్యా కరోనా వ్యాక్సిన్‌పై ఎన్నో అనుమానాలు.. అందుకు కారణాలు!


మొదటగా అమెరికాలోని కాలిఫోర్నియాలో భూకంపం అలర్ట్స్ ఇవ్వనున్నట్లు గూగుల్ తెలిపింది. యూఎస్‌జీఎస్, క్యాల్ ఓఈఎస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్‌లీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి సంస్థలు ఏర్పాటు చేసిన 700కు పైగా సిస్మోమీటర్ల సిగ్నల్స్ ఆధారంగా కాలిఫోర్నియాలో గూగుల్ భూకంపం అలర్ట్స్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు