హంటావైరస్... ఇప్పటికే కరోనావైరస్ చేస్తోన్న విలయ తాండవం సరిపోదన్నట్టుగా కొత్తగా మళ్లీ ఇదేం వైరస్ అని అనుకుంటున్నారా ? అయితే దీని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిందే. కరోనావైరస్ పుట్టిన చైనాలోనే ఈ వైరస్ కూడా పుట్టింది. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ పుట్టిన చైనాలోనే మరో కొత్త వైరస్ పుట్టుకురావడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ కూడా కనిపెట్టక ముందే.. చైనాలో కొత్తగా హంటావైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్టుగా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. యునాన్ ప్రావిన్స్ నుండి శాంటాంగ్ ప్రావిన్స్‌కు వెళ్తున్న ఓ వ్యక్తి బస్సులోనే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి హంటావైరస్ సోకినట్టుగా గుర్తించిన వైద్యులు.. ఆ బస్సులోని మిగతా వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు.


హంటావైరస్ అంటే ఏమిటి ?
హంటావైరస్ అనేది ముఖ్యంగా ఎలుకల నుండి వ్యాపిస్తుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిశోధనలో వెల్లడైంది. హాంటావైరస్ సోకడం ద్వారా హాంటావైరస్ వ్యాధి వస్తుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది.


అమెరికాలోని హాంటావైరస్లను 'న్యూ వరల్డ్' హాంటావైరస్‌లుగా పిలుస్తారు. ఈ న్యూవరల్డ్ హాంటావైరస్ కారణంగా హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (HPS) వచ్చే ప్రమాదం ఉంది. యూరప్, ఆసియాలో కనిపించే హాంటావైరస్‌లను 'ఓల్డ్ వరల్డ్' హాంటావైరస్ అని పిలుస్తారు. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టించిన కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,00,000 మార్కుకు చేరుకోగా.. మరోవైపు ఈ హాంటావైరస్ వ్యాపిస్తే.. దారి పరిణామాలు ఎలా ఉంటాయోననే ఆందోళన అందరినీ కలిచివేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 16,500 ను దాటింది.