Happy Labour Day 2023: ప్రతి కార్మికుడికి లేబర్ డే శుభాకాంక్షలు, సోషల్ మీడియాతో ఇలా విషెస్ తెలపండి!
Happy Labour Day 2023 Wishes: ఈ రోజు కార్మిక శ్రమ దోపిడికి విముక్తి కలిగిన రోజు కాబట్టి ప్రతి శ్రమికుడు పండగ జరుపుకునే రోజు. కాబట్టి ప్రతి కార్మికుడు మే 1వ తేదిన పండగను జరుపుకోవాలి. అంతేకాకుండా వారికి ఇలా శుభాకాంక్షలు తెలపండి.
Happy Labour Day 2023 Wishes: ఈ రోజే కార్మికుల పండగ..కార్మికులు తమ కోరికలు పోరాట పద్ధతిలో నెరవేర్చుకున్న రోజు ఇది. వందల సంవత్సరాలుగా వస్తున్న గొడ్డు చాకిరీకి విముక్తి కలిగిన రోజు మేడే.. మన దేశాలతో పాటు పలు దేశాల్లో మే 1వ తేదీని సెలవు రోజుగా ప్రకటించడం సంప్రదాయంగా ఇప్పటికీ కొనసాగుతుంది. పెట్టుబడిదారి వ్యవస్థపై కార్మిక విజయం సాధించన రోజు కాబట్టి మే 1వ తేదీని కార్మికులు పండగ రోజుగా భావిస్తారు. 1886 సంవత్సరంలో ప్రారంభమైన కార్మిక పోరటం.. కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎంతో మంది కార్మికులు ప్రాణాలను బలిదానం చేశారు. అందుకే ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలన్నింటికీ ఈ రోజు భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించారు. ఈ కార్మికుల పండగను ఉద్దేశించి మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలిపండి.
లేబర్ డే శుభాకాంక్షలు ఇలా తెలపండి:
ఎలాంటి కల్మషం లేకుండా కష్టపడి పని చేసే సోదరులందరికీ..
కార్మికుల పండగ శుభాకాంక్షలు.
ధనవంతులు వారికున్న ధనం వల్ల శాంతిని కోల్పోతారు.
కార్మికుడు పొడి రొట్టె తిని కూడా హాయిగా నిద్రపోతాడు.
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
సమస్యలు పెరిగితే నిస్సహాయుడు,
శ్రమ చేసి కుటుంబాన్ని పోషించే ప్రతి వ్యక్తి కూలీ.
కార్మికుల పండగ శుభాకాంక్షలు.
ధనవంతుడు మరింత ధనవంతుడు కావడానికి ప్రశాంతతను కోల్పోతాడు..
కానీ కార్మికుడు మాత్రం పొట్ట నిండా అన్నం ఉంటే హాయిగా నిద్రపోతాడు!
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
దేవుడు మమ్మల్ని పనికి పంపాడు.. దేవుడు మనకు పని ఇవ్వడం ఆపే వరకు జీవితం కొనసాగుతుంది.
కార్మికుల పండగ శుభాకాంక్షలు.
కష్టపడి పనిచేయడం వల్ల దాని ఫలితం ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది.
దీని ఫలితం ప్రకృతి ఖచ్చితంగా ఇస్తుంది .
లేబర్ డే శుభాకాంక్షలు.
అసలు లేబర్ లేకుంటేనే ప్రపంచం లేదు..
ప్రపంచ కలలను నెరవేర్చేవాడే కార్మికుడు..
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
ఎవరైతే కష్టపడి పని చేస్తారో..
ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తారో..
అతడు ఎల్లపుడు ప్రశాంతంగా ఉంటాడు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook