Heartbreaking photo of Syrian father & son wins SIPA awards 2021: సిరియా (Syria).. గ‌ల్ప్ దేశాల్లో ఒకటైన ఈ దేశంలో ప్ర‌భుత్వ దళాలకు - ఉగ్ర‌వాదుల‌కు మధ్య నిత్యం పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. ఎపుడు ఎక్కడ ఎలాంటి పాలుడు సంభవిస్తుందో తెలియక సామాన్య ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఎపుడు సిరియా దేశం వదిలి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా గాయపడ్డ సామాన్య ప్రజలలో ఒకరే ముంజీర్.. సిరియాలో జరిగిన ఒక బాంబు దాడిలో ఒక కాలును పూర్తిగా కోల్పోయాడు. అయితే ముంజీర్ కుదారుడు మాత్రం రెండు కాళ్లు  లేకుండానే జన్మించాడు. ఇపుడు వారిద్దరికీ చెందిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది. ముంజీర్ తన కుమారుడిని ఆడిస్తున్న ఒక ఫోటోను... మెహ్మెట్ అస్లాన్ అనే టర్కీ ఫోటోగ్రాఫర్ 'హార్డ్‌షిప్ ఆఫ్ లైఫ్' పేరుతో సియానా ఇంటర్నేషనల్ ఫోటో అవార్డ్స్ (SIPA) 2021లో పాల్గొనటంతో.. ఈ ఫోటో ఎంపిక అయింది.. 


Also Read: T20 World Cup: తొలి ఓవర్ 1-0-2-3.. టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్ అంటున్న ఫ్యాన్స్


టర్కీలోని హటే ప్రావిన్స్‌లోని రేహాన్లీ జిల్లాలో సిరియా సరిహద్దుకు సమీపంలో తీసిన ఈ ఫోటో చూసిన ప్రపంచ వ్యాప్త ప్రజలు బాధతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాలు కాళ్లు లేని తండ్రి రెండు కాళ్లు లేని కొడుకును ఆడిస్తున్న ఫోటో కన్నీరు పెట్టిస్తుంది. అవార్డుకు ఎంపికైన ఈ ఫొటో నెటిజ‌న్ల‌కు ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, కంటతడి పెట్టిస్తోంది. 




ఫోటో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు... "ఫోటో చూస్తే సిరియా  దేశంలో పరిస్థితులు అర్థం అవుతున్నాయి".. "ఇది చాలా ఘోరం"... "దేవుడే వాళ్లకి తోడుంటాడు".. వాళ్లు పేదలు.. "ఫోటో తీసిన వాళ్లు కోట్లు గడిస్తారు.. కానీ వాళ్లు అలానే పేదరికంలో ఉండిపోతారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: CovidUpdates: దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు, 585 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి