న్యూఢిల్లీ: గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీంకు (Dawood Ibrahim) కరోనా సోకి మరణించాడనే వార్తలు ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. దావూద్ ఇబ్రహీం తో పాటు తన భార్య COVID-19 కు పాజిటివ్ తేలిందని, కరాచీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం గత కొన్ని రోజుల నుండి వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. కరోనా పరీక్షలు నిర్వహించలేదని, భాయ్ (దావూద్ ఇబ్రహీం ఆరోగ్యంగానే ఉన్నాడని, షకీల్ తో పాటు మా కుటుంబం నుండి ఎవ్వరూ ఆసుపత్రిలో చేరలేదన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: COVID-19 updates: మరో 161 మందికి కరోనా పాజిటివ్


అయితే COVID-19 తో బాధపడుతున్నడన్న వార్తలు సోషల్ మీడియాలో దావూద్ ఇబ్రహీంను, WWE సూపర్ స్టార్, (The Undertaker) ది అండర్టేకర్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ (shahid afridi) షాహిద్ అఫ్రిదిలతో పోలుస్తున్నారు. గ్యాంగ్ స్టర్ దావూద్ సన్నిహితులు స్పందిస్తూ భాయ్ మరణించాడనే వార్త అనేక సందర్భాల్లో పుకార్లు సృష్టించారని, ఇప్పుడు అలాంటిదేనన్నారు. 


అఫ్రిదితో పోలికలు.. 


క్రికెట్ కు గుడ్ బై చెప్పడం మళ్ళీ తిరిగి జట్టులోకి రావడం అఫ్రిదికి అలవాటే. కాగా ఇప్పటివరకు అఫ్రిది మూడుసార్లు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆఫ్రిదిలాగే, దావూద్ ఇబ్రహీం పునరాగమనం చేస్తారనే వార్తలు మళ్ళీ వెలువడ్డాయి. అఫ్రిది చివరకు 2017 లో అంతర్జాతీయ క్రికెట్ (ICC) నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుండి పాకిస్తాన్ తరపున ఆడలేదు. shahid afridi ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్‌లు ఆడుతూనే ఉన్నాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..