COVID-19 updates: మరో 161 మందికి కరోనా పాజిటివ్

AP COVID-19 Updates: అమరావతి : ఏపీలో కరోనావైరస్ కోరలు చాస్తోంది. కరోనా సోకిన వారిని గుర్తించేందుకు ఓవైపు భారీ సంఖ్యలో కోవిడ్-19 టెస్టులు (COVID-19 tests) చేస్తూనే ఉన్నారు. మరోవైపు కరోనా నివారణ కోసం భారీ ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు

Last Updated : Jun 6, 2020, 04:08 PM IST
COVID-19 updates: మరో 161 మందికి కరోనా పాజిటివ్

AP COVID-19 Updates: అమరావతి : ఏపీలో కరోనావైరస్ కోరలు చాస్తోంది. కరోనా సోకిన వారిని గుర్తించేందుకు ఓవైపు భారీ సంఖ్యలో కోవిడ్-19 టెస్టులు (COVID-19 tests) చేస్తూనే ఉన్నారు. మరోవైపు కరోనా నివారణ కోసం భారీ ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. శనివారం ఏపీలో కొత్తగా 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 3588కి చేరింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు ప్రామాణికంగా తీసుకుంటే.. గత 24 గంటల్లో 12,771 మందికి కరోనావైరస్ పరీక్షలు చేయగా... వారిలో 161 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఓ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. Telangana: కరోనాతో రాష్ట్రంలో మరో 8 మంది మృతి )

తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 29 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మొత్తం 2,323 కు చేరింది. కరోనా‌వైరస్‌తో ఇప్పటివరకు రాష్ట్రంలో 73 మంది మృతి చెందగా.. ప్రస్తుతం మరో 1,192 రాష్ట్రంలోవి కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. TTD rules post lockdown: లాక్‌డౌన్ తర్వాత టిటిడి భక్తులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు )

విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన తర్వాత కరోనావైరస్ బారినపడిన వారి సంఖ్య 131 కాగా.. వారిలో ప్రస్తుతానికి నలుగురు డిశ్చార్జ్ కాగా మరో 127 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు తిరిగొచ్చిన వారిలో 741 మందికి కరోనా సోకగా.. వారిలోనూ ప్రస్తుతం 467 మందికి కరోనా చికిత్స అందిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News