Hatred Comments: అమెరికాలోని స్వామి నారాయణ ఆలయం గోడలు, సైన్ బోర్డులపై కన్పించిన విద్వేషపు రాతలు కలకలం రేపాయి. భారత వ్యతిరేక, మోదీ వ్యతిరేక నినాదాలతో అక్కడి గోడల్ని నింపేశారు. అదే సమయంలో ఖలిస్తానీ అనుకూల నినాదాలు రాశారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనను ఇండియా తీవ్రంగా ఖండించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని నెవార్క్ స్వామి నారాయణ్ మందిర్ వాసన సంస్థాన్ గోడలపై ఖలిస్తానీ వేర్పాటువాదులు మోదీకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు రాశారు. ఆలయానికి వచ్చేవారిలో భయం రేపేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని ఆలయం యాజమాన్యం మండిపడింది. ఈ ఘటనపై ఇండియన్ ఎంబసీ స్పందించింది. భారత సమాజం మనోభావాల్ని దెబ్బతీసిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. అమెరికా, కెనడాలోని హిందూ ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా జరిగాయి. భారత్ టార్గెట్‌గా అమెరికా, కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాలు పెరగడంపై ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. 


గతంలో అంటే ఆగస్టు నెలలో కెనడాలోని సర్రేలో ఓ దేవాలయాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. బ్రిటీష్ కొలంబియాలోని లక్ష్మీ నారాయణ్ మందిర్ గోడలు, గేట్లపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలతో పోస్టర్లు అంటించారు. మొత్తానికి తాజాగా అమెరికాలోని లక్ష్మీ నారాయణ ఆలయం గోడలపై  ఈ తరహా నినాదాలు ప్రత్యక్షం కావడం ఆందోళన కల్గిస్తోంది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ చేసిన విజ్ఞప్తికి నెవార్క్ పోలీసులు స్పందించారు. గుడి గోడలపై విద్వేష వ్యాఖ్యల ఘటనపై విచారణ చేపడతామన్నారు.



కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ నిజ్జార్ హత్య జరిగినప్పటి నుంచి అమెరికా, కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఇటీవల మరో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే ఓ భారతీయుడిని అమెరికా పోలీసులు అదుపులో తీసుకున్నారు. 


Also read: Prashant kishor: ప్రశాంత్ కిశోర్-చంద్రబాబు భేటీలో ఏం జరిగింది, ఎస్ చెప్పారా నో చెప్పారా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook