Prashant kishor: దేశంలోని ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక్కసారిగా తెరపైకొచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడకుండా నేరుగా వెళ్లిపోయినా..భేటీలో ఏం జరిగిందనేది ఆసక్తి రేపుతోంది. అదే ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది.
ఏపీలో ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వైనాట్ 175 లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహరచన చేస్తోంది. అటు తెలుగుదేశం-జనసేన కలిసి వస్తున్నాయి. ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు టీడీపీ అన్ని ప్రయత్నాలు చేస్తూనే చివరి ప్రయత్నం ప్రారంభించింది. గత ఎన్నికల్లో వైసీపీకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ను పిలిపించింది. నారా లోకేశ్ స్వయంగా అతనిని ప్రత్యేక విమానంలో విజయవాడకు తీసుకొచ్చారు. అక్కడ్నించి ఇద్దరూ కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ దాదాపు 3 గంటలు సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాకుండా విజయవాడ విమానాశ్రయానికి వెళ్లిన ప్రశాంత్ కిశోర్ అక్కడ కొందరు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబును కేవలం మర్యాద పూర్వకంగానే కలిశానని, ఇందులో రాజకీయాల ప్రస్తావన లేదన్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ కావడంతో పిలిచిన వెంటనే వచ్చినట్టు చెప్పారు. అదే సమయంలో ఆఫ్ ది రికార్డ్ కొన్ని పరిణామాలు విన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేందుకు అంగీకరించలేదని పీకే చెప్పినట్టు సమాచారం. మరో మూడు నెలల్లో ఎన్నికలున్న తరుణంగా ఇప్పుడు చేసేదేమీ లేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జరగాల్సి డ్యామేజ్ జరిగిపోయిందని, అది సరిదిద్దుకునేందుకు తగిన సమయం లేదని చెప్పినట్టు సమాచారం.
మూడు గంటల భేటీలో చంద్రబాబు చేసిన కొన్ని ప్రతిపాదనలను ప్రశాంత్ కిశోర్ నిరాకరించినట్టు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో సడలని విశ్వాసముందని, అది చెరిపేందుకు సమయం సరిపోదని తేల్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఐ ప్యాక్ టీమ్ కూడా అధికారికంగా ట్వీట్ చేసింది. గత ఏడాది నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తాము అనుబంధంగా పనిచేస్తున్నామని, 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ మరోసారి ఘన విజయం సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని స్పష్టం చేసింది.
Also read: CM Jagan Mohan Reddy: రాయలసీమకు తలమానికం.. రిమ్స్ మెడికల్ హబ్: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook