Hawaii Flight Turbulence: విమానాశ్రయంలో మరోకొద్ది సేపట్లో సేఫ్‌గా ల్యాండ్ అవ్వాల్సిన విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. బలమైన గాలులు విమానాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. దాంతో విమానంలో ఉన్న 300 మంది ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గాయపడగా.. అందులో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ  ఘటన హవాయిలో చోటు చేసుకుంది. బలమైన గాలులకు విమానం పైకప్పుకు కూడా క్రాక్స్ వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఫీనిక్స్‌ నుంచి హొనొలులుకు ఆదివారం బయల్దేరింది. ఈ విమానంలో 300 మంది  ప్రయాణిస్తున్నారు. వీరిలో 10 మంది క్రూ మెంబర్స్, 278 మంది ప్యాసింజర్లు ఉన్నారు. హవాయిలో విమానం ల్యాండ్ అయ్యేముందు భారీగా గాలులు వీచాయి. దాంతో విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. విమానంలో సీటు బెల్టులు సరిగా ధరించని వారు పైకి ఎగిరిపడ్డారు. కొందరు విమానం పైకప్పును ఢీకొట్టి కింద పడ్డారు. మరికొందరు అటూఇటూ ఊగిపోయి.. కిటికీలను, ముందునున్న సీట్లను ఢీకొట్టారు. 



ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారికి లోపల ఉన్న ప్రయాణికులు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆపై చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇందులో 14 నెలల చిన్నారి కూడా ఉంది. విమానం ఎత్తు రెండుసార్లు అకస్మాత్తుగా తగ్గిపోయిందని లోపల ఉన్న ప్రయాణికులు చెప్పారు. తాము తీవ్ర భయబ్రాంతులకు గురయ్యామని మరొకిందరు ప్యాసింజర్లు పేర్కొన్నారు. విమానం కుదుపులకు గురవ్వడంతో అత్యవసర ల్యాండింగ్‌కి హవాయి ఎయిర్‌లైన్స్‌ అనుమతి ఇచ్చింది. తీవ్ర గాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఎమర్జెన్సీ రూమ్స్‌కి పంపించారు.  


Also Read: CM Jagan: సీఎం జగన్ అంటే ఇష్టం.. కుప్పంలో మాత్రం పోటీ చేయను: స్టార్ హీరో


Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం రేట్లు ఇలా ఉన్నాయి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.