Atom Bomb: మహా ఉత్పాతానికి 75 ఏళ్లు..నేటికీ జీవచ్ఛవాలుగా జనం
రెప్పపాటుకాలంలో సర్వం కాలిపోవడమంటే తెలుసా..నాటి మహా విధ్వంసానికి నేటికి 75 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ జీవచ్ఛవాలుగా కన్పించే దృశ్యాలు. ప్రపంచం నివ్వెరపోయిన ఆ సంఘటన..అగ్రరాజ్య తప్పిదానికి భారీ మూల్యమదే. జపాన్ నగరాలపై అణుబాంబు విలయం ( Atomic Explosion ) మహోత్పాతం అంతా ఇంతా కాదు..
రెప్పపాటుకాలంలో సర్వం కాలిపోవడమంటే తెలుసా..నాటి మహా విధ్వంసానికి నేటికి 75 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ జీవచ్ఛవాలుగా కన్పించే దృశ్యాలు. ప్రపంచం నివ్వెరపోయిన ఆ సంఘటన..అగ్రరాజ్య తప్పిదానికి భారీ మూల్యమదే. జపాన్ నగరాలపై అణుబాంబు విలయం ( Atomic Explosion ) మహోత్పాతం అంతా ఇంతా కాదు..
రెండో ప్రపంచ యుద్ధకాలమది ( second world war ). అమెరికా-జపాన్ ( America - japan ) ల మధ్య రేగిన ఆధిపత్యపోరుకు పరాకాష్ట..అగ్రరాజ్యం అమెరికా చేసిన ఘోర తప్పిదానికి ఫలితం. 1945 ఆగస్టు 6,9 తేదీల్లో హిరోషిమా, నాగసాకి నగరాలపై ( Atom bombs on Hiroshima and Nagasaki ) అణుబాంబులు పడ్డాయి. ఆగస్టు 6న హిరోషిమా( Hiroshima ) నగరంపై...9వ తేదీన నాగసాకి ( Nagasaki ) నగరంపై. రెండు ఘటనల్లో దాదాపు లక్షన్నర మంది మరణించి ఉండవచ్చని అంచనా. ఈ ప్రాంతంలో జనమంతా కేవలం సెకను వ్యవధిలోనే మాడి మసైపోయారు. రేడియో ధార్మికత ప్రభావంతో ఇప్పటికీ జీవచ్చవాలుగా బతుకీడుస్తున్నారు. ఆగస్టు 9 ఉదయం 11 గంటల 2 నిమిషాలకు ప్యాట్ మ్యాన్ ( Patman ) పేరుతో జారవిడిచిన అణుబాంబు దాదాపు 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భవనాల్ని నేలమట్టం చేసింది. 22 కిలోటన్నుల అణుబాంబు ఇది. అటు ఆగస్టు 6న హిరోషిమాపై జరిగిన అణుబాంబు దాడి పేరు లిటిల్ బాయ్ ( little boy ).
బాంబులు కురిసిన ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏకంగా 4 వేల సెల్సియస్ కు చేరుకుంది. రేడియో ధార్మికత అయితే వర్షం పడినట్టే పడింది. ఈ ప్రభావంతో కొన్ని తరాల వరకూ కేన్సర్, ధైరాయిడ్, ఊపిరితిత్తులు, రొమ్ము కేన్సర్ బారిన పడుతూ వచ్చారు. పిల్లల్లో మానసిక శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపింది. ఈ అణు విధ్వంసాన్ని ప్రపంచం ( Atomic explosion ) మొత్తం చూసింది కాబట్టే...మరోసారి ఇలాంటి ఉత్పాతం జరగకుండా ఉండేందుకు అణ్వస్త్రాలపై నిషేధ నిర్ణయం జరిగింది. నాగసాకి ( Nagasaki ) నగరం చుట్టూ పర్వత ప్రాంతాలుండటంతో ఆ విధ్వంసం అక్కడికే పరిమితమైంది. లేదంటే ఇంకా ఘోరం జరిగేది. నాడు అణుబాంబు నాగసాకిపై కాకుండా కోకురా నగరంపై వేయాల్సిన వ్యూహం వాస్తవానికి. కానీ అక్కడ వాతావరణం మబ్బుపట్టి అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఉన్న నాగసాకిని ఎంచుకున్నారు.