లాస్ ఏంజెల్స్: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా విషాదకర సంఘటన చోటుచేసుకున్నప్పటికీ భయంకరమైన ప్రమాదం నుండి ప్రాణాపాయం తప్పించుకున్నాడు ఓ అదృష్టవంతుడు. సౌత్ లాస్ ఏంజిల్స్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగిందని కేటీఎల్ఏ పేర్కొంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కాగా బీఎమ్‌డబ్ల్యూ కారును నడుపుతూ ఎడమప్రక్కకు మళ్లించడంతో అకాస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయిన సంఘటన వీడియోలో బందీ అయింది. ఈ భయంకర ప్రమాదకార వీడియో ఫ్యూటేజి ని చూసి అధికారులు నివ్వెరపోయారు. ఇంతటి భయంకర సంఘటన చోటుచేసుకున్నప్పటికీ కారులో ఉన్న డ్రైవర్ స్వల్ప గాయాలతో తప్పించుకోగలగలగడం కొసమెరుపు. 




ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు డ్రైవర్ స్వల్ప గాయలతో బయటపడ్డాడని, ఇకపై భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని, రైల్వే ట్రాక్ ల చుట్టూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ కాగా, డ్రైవర్ భయంకరమైన ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..