World dangerous demilitarized zone: ఆ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకమైన ప్రాంతం. అక్కడి సైనికుల కళ్లు గప్పి ఇతరులెవరూ వెళ్లడం అసాధ్యం. అంతగా పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ ఉన్న జోన్ అది. మరి ఆ వ్యక్తి అంతటి ప్రమాదకర ప్రాంతంలో ఎలా వెళ్లగలిగాడు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటిగా ఉన్నది ఆ సరిహద్దు ప్రాంతం. ఉత్తర-దక్షిణ కొరియా ( North-South Korea Border )సరిహద్దు ప్రదేశమది. రెండు దేశాల సరిహద్దు కావడమే కాకుండా శత్రుదుర్బేధ్యమైనది కూడా. ఈ సరిహద్దును ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైందిగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలోని సైనికుల కళ్లు గప్పి ఇతరులెవరూ ప్రవేశించలేరు. అటువంటిది దక్షిణ కొరియా ( South Korea )సైనికుల కళ్లు గప్పి ఉత్తర కొరియాకు చెందిన ఓ వ్యక్తి ప్రమాదకర జోన్‌లో ప్రవేశించాడు. డీమిలిటరైజ్డ్ జోన్‌ ( Demilitarized Zone)లో అడుగుపెట్టడమే కాకుండా దాదాపు 3 గంటల సేపు గడిపాడక్కడ. ఫిబ్రవరి 23వ  తేదీ అంటే మంగళవారం తెల్లవారుజామున 4.16 నిమిషాలకు డీఎమ్‌జెడ్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తిని 3 గంటల వరకూ గుర్తించలేకపోయారు. ఉదయం 7 గంటల 27 నిమిషాలకు అతన్ని భద్రతా బలగాలు అదుపులో తీసుకునేంతవరకూ అంటే దాదాపు 3 గంటల 11 నిమిషాలు అంతటి కట్టుదిట్టమైన ప్రాంతంలో ప్రమాదకర ప్రదేశంలో గడపగలిగాడు. 


అంతసేపు అతన్ని రక్షణ బలగాలు ఎందుకు గుర్తించలేకపోయాయి..ఎలా వెళ్లగలిగాడనేది చర్చనీయాంశంగా మారింది. ప్రాధమిక పరిశీలన అనంతరం సముద్రమార్గం ద్వారా డీఎమ్‌జెడ్‌లోకి ప్రవేశించి ఉంటాడని భావిస్తున్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో సరిహద్దులోని కంచె వెంట నడుస్తూ..డ్రైనేజ్ టన్నెల్ మార్గం ద్వారా డీఎమ్‌జెడ్ లోనికి ప్రవేశించి ఉంటాడని..ఈ దారి మిలట్రీకు కూడా తెలియదని స్థానిక మీడియా చెబుతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి వెళ్లడంపై దర్యాప్తు జరుగుతోందిప్పుడు. 


Also read: Racial Comments: కోపం వచ్చి అతడి ముక్కు పగలగొట్టానని చెప్పిన Barack Obama


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook