Covid Vaccine Interval: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఎప్పటికప్పుడు తాజా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తొలిడోసుకు రెండవ డోసుకు ఎంత విరామం ఉండాలనే విషయంపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి తాజా పరిశోధన ఏం చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వ్యాక్సినేషన్‌కు(Corona Vaccination) సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 5-6 రకాల కంపెనీ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే రెండు డోసుల మధ్య విరామం కచ్చితంగా ఎంత ఉండాలనేదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఎప్పటి కప్పుడు జరుగుతున్న పరిశోధనల్లో విభిన్నాంశాలు వెలువడుతున్నాయి. అమెరికాలోని మయో క్లినిక్ వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్ చేసిన తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వ్యాక్సిన్ మొదటి డోసు తరువాత రెండవ డోసు ఆలస్యమైతే ఎక్కువ మేలు జరుగుతుందని తాజా పరిశోధన ( Research on Vaccination) వెల్లడించింది. ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత రెండవ డోసు తీసుకునే విరామం పెరిగితే యాంటీ బాడీలు (Anti Bodies) 20 శాతం నుంచి 3 వందల శాతం వరకూ పెరుగుతాయని తేలింది. దాదాపు అన్ని రకాల వ్యాక్సిన్లలో ఇవే ఫలితాలు వెలువడ్డాయి. మొదటి డోసు వ్యాక్సిన్ వేసినవారికే రెండవ డోసు వ్యాక్సిన్ కేటాయిస్తున్న నేపధ్యంలో చాలామందికి వ్యాక్సిన్ అందడం ఆలస్యమవుతోంది. అలాకాకుండా మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారికి రెండవ డోసు ఆలస్యం చేసి..ఇతరులకు కేటాయిస్తే మెరుగైన ఫలితాలుంటాయని మయో క్లినిక్ వ్యాక్సిన్ రీసెర్చ్ చెబుతోంది.


Also read: US Covid Relief: ఇండియాకు 5 వందల మిలియన్ డాలర్ల సహాయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook