US Covid Relief: కరోనా విపత్కర పరిస్థితులతో అల్లాడుతున్న భారదేశానికి ప్రపంచం యావత్తూ అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత, వైద్య సామగ్రిని విరివిగా అందిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా..ఇండియాకు అక్షరాలా చేసిన సహాయం విలువెంతో తెలుసా..
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)దేశాన్ని వణికిస్తోంది. రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదైన పరిస్థితి ఏర్పడింది. గత కొద్దిరోజులుగా ఇండియాలో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా విపత్కర పరిస్థితులతో దేశంలో ఆక్సిజన్, బెడ్స్, వైద్య సామగ్రి, అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ నేపద్యంలో ఇండియాను ఆదుకునేందుకు అన్నిదేశాలూ ముందుకొచ్చాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, సింగపూర్, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, మలేషియా దేశాల్నించి పెద్దఎత్తున ఆక్సిజన్, ఇతర వైద్య సామగ్రి సహాయంగా అందింది. అగ్రరాజ్యం అమెరికా (America) ఇండియాకు మద్దతుగా నిలిచి సహాయం అందిస్తోంది. ఈ క్రమంలో వైట్‌హౌస్ నిన్న కీలక ప్రకటన చేసింది.
ఇప్పటి వరకూ ఇండియాకు 5 వందల మిలియన్ డాలర్ల సహాయం చేసినట్టు వైట్‌హౌస్ (White House) వర్గాలు ప్రకటించాయి. 80 మిలియన్ల వ్యాక్సిన్లకు ఇతర దేశాలకు పంపిణీ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. ఇప్పటి వరకూ ఇండియాకు అమెరికా ప్రభుత్వం 5 వందల మిలియన్ డాలర్ల కోవిడ్ (Covid Relief to India) సహాయాన్ని అందించిందని వైట్‌హౌస్ సెక్రటరీ ప్రకటించారు. అమెరికా సమాఖ్య, రాష్ట్ర ప్రభుత్వాలు, అమెరికన్ కంపెనీలు, సంస్థలు, ప్రైవేట్ పౌరుల సహకారంతో ఈ సహాయం అందించినట్టు తెలిపారు. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో బాధపడుతున్న ఇతర దక్షిణాసియా దేశాలకు సైతం సహాయాన్ని అందించేందుకు జో బిడెన్ (Joe Biden) ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందులో భాగంగా 80 కోట్ల వ్యాక్సిన్లు ( 80 Crores vaccines) అందించాలన్నారు. ఇందులో 60 కోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు, మరో మూడు కంపెనీలకు చెందిన 20 కోట్ల వ్యాక్సి్లు ఉన్నాయి.
Also read: Singapore warns Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి సింగపూర్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook