Kabul Airport: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. తాలిబన్లు ఆఫ్ఘన్ నేలను హస్తగతం చేసుకన్న తరువాత దేశంలో హింస రగులుతోంది. తాజాగా కాబూల్ విమానాశ్రయం వద్ద జంటపేలుళ్లు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాలిబన్లు..ఆఫ్ఘనిస్తాన్‌ను(Afghanistan)వశపర్చుకున్న తరువాత అక్కడి పరిస్థితులు మారిపోతున్నాయి. తాలిబన్లపై భయంతో జనం అక్కడ్నించి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ ప్రాంతాల్నించి ఏదో విధంగా కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కాబూల్ విమానాశ్రయంలో జరిగిన జంట పేలుళ్లు పెను భీభత్సాన్ని సృష్టించాయి. హమీద్ కర్జాయ్ విమానాశ్రయం అబేగేట్, ఒక హోటల్ వద్ద వరుసగా భారీ పేలుళ్లు(Bomb Blasts)సంభవించాయి. ఈ పేలుళ్లు ఘటనలో 13 మంది మరణించారు. మరణించినవారిలో పిల్లలు కూడా ఉన్నారని తాలిబన్ (Taliban)ప్రతినిధి ఓ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధితో తెలిపారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనను ఆత్మాహుతి ఘటనగా(Suicide Attack) భావిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. 


సరిగ్గా కొన్ని గంటల ముందు కాబుల్ విమానాశ్రయం(Kabul Airport)వద్ద ఇలాంటి ఘటన జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందే హెచ్చరికలు రావడంతో అమెరికా అప్రమత్తమైంది. మరో పేలుడు జరిగే అవకాశముందని ఆమెరికన్ ఆర్మీ(American Army)హెచ్చరిస్తోంది. కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రదాడి జరిగే ప్రమాదముందని అమెరికా సహా నాటో దేశాలు హెచ్చరించిన గంటల వ్యవధిలో పేలుళ్లు జరగడం గమనార్హం. 


Also read: China and Talibans: తాలిబన్లతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన చైనా, దేశ పునర్నిర్మాణంలో చేయూత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook