'కరోనా వైరస్'... ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న పేరు.  కరోనా వైరస్ ప్రభావంతో జన జీవనంలో చాలా మార్పులు వచ్చేశాయి. కార్పొరేట్ ఆఫీసులు సైతం ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఐతే అలా పని చేయించుకోలేని కంపెనీలకు తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో సౌదీ అరేబియాలోని చమురు కంపెనీ ఆరామ్‌కో కూడా ఒకటి. ఇప్పుడు ఆ కంపెనీ చేసిన నిర్వాకం  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  నెటిజనుల నుంచి విమర్శలు ఎదుర్కుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కరోనా వైరస్' సోకకుండా ఉండాలంటే . . చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లేదా హ్యాండ్ శ్యానటైజర్‌లను ఉపయోగించాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే విధంగా  ప్రచారం చేస్తున్నారు. దీన్నే కొంచెం కొత్తగా అమలు చేసిన ఆరామ్‌కో కంపెనీ అభాసుపాలవుతోంది.  ఆరామ్‌కో కంపెనీలో హ్యాండ్ శ్యానటైజర్ కోసం ఓ వ్యక్తిని నియమించారు.  అతడు ఆఫీసులో కలియదిరుగుతూ అందరు ఉద్యోగులకు శ్యానటైజర్ అందిస్తూ ఉంటాడు. ఐతే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజనులు కంపెనీ తీరుపై విమర్శలు కురిపిస్తున్నాయి.



Read Also: రంగు పడింది.. !!


[[{"fid":"183033","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మరోవైపు సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో  ఆరామ్‌కో కంపెనీ యాజమాన్యం స్పందించింది. తాము చేసిన పనికి క్షమాపణలు కోరింది.



 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..