Hurricane Ida: అమెరికాను వణికించిన హరికేన్.. రివర్ నే రివర్స్ చేసింది!
Hurricane Ida: హారికేన్ కత్రినా గుర్తుందా.. 16 ఏళ్ల క్రితం అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన తుపాను. ఇప్పటికీ ఈ పేరు వింటే అమెరికన్ల గుండెల్లో గుబులు రేగుతుంది. కాగా, ఇప్పుడు కత్రినాను మించిన హారికేన్ ఒకటి అమెరికా మీద విరుచుకుపడింది. ఏకంగా ఈ హరికేన్ నది ప్రవాహ దిశనే మార్చేసింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ తుపాను విధ్వంసం ఏంటో..
Hurricane Ida: అగ్రరాజ్యం అమెరికాను ఓ హరికేన్ అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాన్ ధాటికి గాలులు దాదాపు 240 కిలోమీటర్ల వేగం(240kmph)తో వీస్తున్నాయంటే( winds are blowing) నమ్మండి. అంతేకాదు ఏకంగా నదీ ప్రవాహ దిశను మార్చి వెళ్లేలా చేసింది ఈ హరికేన్. ఈ తుపానుకు ఇడా హరికేన్(Ida hurricane ) అని నామకరణం చేశారు. అవును న్యూఓర్లిన్స్(new Orlin)లో ఉన్న ఓ నది(river) వ్యతిరేక దిశ(opposite direction)లో ప్రవహిస్తోంది. ఆ నది పేరు ఏంటంటే మిస్సిస్సిపీ(Mississippi) . ఇంతకీ ఆ నది స్వరూపం ప్రస్తుతం ఎలా ఉంది.. రాబోయే వాతావరణ పరిస్థితుల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఇది అసాధారణమైంది..
అమెరికాను ఇడా హరికేన్(Ida hurricane) భయపెడుతోంది. ఇడా ధాటికి అక్కడి న్యూ ఓర్లీన్స్ సమీపంలో మిస్సిస్సిప్పి(Mississippi)) నది తిరిగి రివర్స్ దిశ(reverse direction)లో పయనిస్తుండటమే పరిస్థితికి అద్దం పడుతోంది. ఇడా హరికేన్ ప్రభావంతో గాలులు 240 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయని యూఎస్ జియలాజికల్ డిపార్టుమెంట్ ప్రకటించింది. దీంతో ఏ క్షణంలోనైనా విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాలులు వీచడం, తుపానులు(tupan) రావడం తెలిసిందేనని.. కానీ, ఇలా ఓ నదీ తిరిగి రివర్స్‌లో ప్రవహించడం అసాధారమైనదిగా అక్కడి వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Delhi Heavy Rains: దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం, ఒక్కరోజులోనే రికార్డు
లూసియానా(Luciana)లోని పోర్ట్ ఫోర్‌చాన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 4 హరికేన్ నుంచి 150 mph వేగంతో గాలులు వస్తున్నాయని నేడా హరికేన్ సెంటర్ (NHC) తెలిపింది. సరిగ్గా 16 ఏళ్ల కిందట 'కత్రినా హరికేన్ '(Hurricane Katrina) విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం అంతటి ఉద్ధృతిలో ఈ ఇడా(Ida) హరికేన్ వచ్చినట్లు అక్కడి నిపుణులు వెల్లడించారు.
ఆదివారం నాడే తుపానుగా..
ఇడా ఆదివారం ఉదయం 4 వ వర్గం తుఫానుగా మారిందని అక్కడి నిపుణలు తెలిపారు.. అయితే 2020లో లారా తుపాను, 1856లో లాస్ట్ ఐలాండ్ హరికేన్ తుపానులు లూసియానాలో అతి తీవ్రమైన, శక్తి వంతమైన తుపానులుగా వచ్చాయని, అవన్నీ 150 mph వేగంతోనే గాలులు వీస్తూ విధ్వంసం సృష్టించాయని వారు భయాందోళనలు వ్యక్తం చేశారు. 2005లో వచ్చిన కత్రినా హరికేన్(Hurricane Katrina) 125 mph వేగంతోనే గాలులు వీచాయని గుర్తు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook