Indian Army hands over apprehended PLA soldier to China | న్యూఢిల్లీ: భార‌త భూభాగంలోకి వ‌చ్చిన చైనా సైనికుడిని ఇండియ‌న్ ఆర్మీ అప్ప‌గించింది. ఈ మేరకు ఆ సైనికుడిని సోమవారం ఉద‌యం 10:10 గంట‌ల‌కు భారత్ - చైనా స‌రిహ‌ద్దులోని చూషుల్ - మోల్దో వ‌ద్ద చైనా సైన్యానికి భార‌త ఆర్మీ అప్ప‌గించింది. జ‌న‌వ‌రి 8 శుక్రవారం రోజున పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (PLA) సైనికుడు ల‌ఢఖ్‌లోని ఎల్ఏసీ వ‌ద్ద స‌రిహ‌ద్దు దాటి భార‌త భూభాగంలోకి వ‌చ్చాడు. అప్ర‌మత్త‌మైన భార‌త బ‌ల‌గాలు ఆ సైనికుడిని ( PLA soldier) అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం త‌మ సైనికుడు అదృశ్య‌మైన‌ట్టు చైనా (China) ఆర్మీ శ‌నివారం ప్ర‌క‌టించింది. Also Read: India Covid-19: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా మరణాలు



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ త‌ర్వాత తమ భూ భాగంలోకి వ‌చ్చినందున పీఎల్ఏ సైనికుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఇండియ‌న్ (India) ఆర్మీ ప్ర‌క‌టించింది. భార‌త సైన్యం - చైనా (India-China) సైన్యం చర్చల అనంతరం పీఎల్ఏ సైనికుడిని (Chushul-Moldo) భారత ఆర్మీ అప్పగించింది. గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ‌ల తర్వాత‌ పీఎల్ఏ సైనికులు భార‌త భూభాగంలోకి ప్రవేశించడం ఇది రెండోసారి. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో కూడా పీఎల్ఏ సైనికుడు ల‌డఖ్ వ‌ద్ద భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించాడు. అప్పుడు కూడా భారత సైన్యం (Indian Army).. చైనాకు అప్పగించింది. Also Read: Bird flu: రాజధాని ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8 శాంపిల్స్ పాజిటివ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook