Indian Embassy Worker Satyendra Siwal Arrested: భారత దేశానికి చెందిన అత్యంత రహస్య సమాచారంను పక్కాదేశాలు కనిపెట్టానికి నానా తంటాలుపడుతున్నాయి. దీనిలో భాగంగా అమ్మాయిలతో హనీ ట్రాప్ కు పాల్పడుతున్నాయి. కొన్ని చోట్లు ఉద్యోగులకు డబ్బుల ఆశలు చూపిస్తున్నాయి. కొందరు ఈ దుండగుల మాయలో పడి అతి సున్నితమైన మనదేశ సమాచారాన్ని, శత్రుదేశాలకు చేరవేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఆర్మీ లో, ఇతర ఉన్నత పదువుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు ఇలాంటి పనులు చేసి అడ్డంగా దొరికి పోయిన సంఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా, మరో ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: Valentines day 2024: వాలెంటైన్స్ డే వెనుక ఉన్న కథ ఇదే.. వారం మొత్తం ఏదో ఒక ప్రత్యేకత!


పాకిస్థాన్  ఇంటెలిజెన్స్ కు భారత్ రహస్య సమాచారం వెళ్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దీనిపై సీరియస్ గా విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే  మాస్కోలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగి సతేంద్ర సివాల్ ను అరెస్టు చేశారు. ఇతగాడు విదేశీ  వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)గా పనిచేస్తున్నట్లు సమాచారం. 


ఐఎస్ఐ శత్రుదేశాల కుట్రదారులు..  భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉద్యోగులను ప్రలోభపెడుతున్నారని, భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారానికి బదులుగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేస్తున్నారని రహస్య మూలాల నుంచి ఏటీఎస్‌కు సమాచారం అందింది. దీంతో ఈ ఆపరేషన్ తెరపైకి వచ్చింది. బైటకు వెళ్తున్న సమాచారం..  భారతదేశ అంతర్గత,  బాహ్య భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించిందని ఏజెన్సీ పేర్కొంది.


ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్‌లోని షామహియుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన సతేంద్ర సివాల్ ఈ గూఢచర్య నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించాడు. అతను మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో తన స్థానాన్ని ఉపయోగించుకుని రహస్య పత్రాలను సంగ్రహిస్తున్నాడని ఆరోపించారు.


డబ్బు కోసం అత్యాశతో ప్రేరేపించబడిన నిందితులు, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,  భారత సైనిక సంస్థల వ్యూహాత్మక కార్యకలాపాలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని ISI హ్యాండ్లర్లకు చేరవేసినట్లు ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. అయితే.. సతేంద్ర సివాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు  మీరట్‌లోని ATS ఫీల్డ్ కు తరలించారు. తమ దైన స్టైల్ లో ఘటనపై పోలీసులు విచారణ చేశారు.


Read Also:  Sreemukhi: తలలో మల్లెపూలతో మత్తెక్కిస్తోన్న శ్రీముఖి.. ఇది మాములు డోస్ కాదండోయ్..


ఈ క్రమంలో సతేంద్రసివాల్.. పోలీసులను పక్కదారి పట్టించేందుకు ప్రయ్నతించాడు. కానీ కొన్ని ఆధారాలు, పత్రాలు చూపెట్టడంతో అడ్డంగా బుక్కైపోయాడు. దీంతో  గూఢచారి కార్యకలాపాలలో పాల్గొన్నట్లు అంగీకరించాడు.  సతేంద్ర సివాల్ 2021 నుండి మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్ (IBSA)గా పనిచేస్తున్నాడు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook