Valentines Week: ఫిబ్రవరి నెల.. సంవత్సరంలో అతి చిన్న నెల కానీ సెలబ్రేషన్స్ పరంగా ఈ మంత్ యూత్ లో చాలా ఫేమస్. ఎందుకంటే ఈనెల 14న వేలంటైన్స్ డే వరల్డ్ వైడ్ ఘనంగా జరుపుతారు. వారం రోజులపాటు పెద్ద పండగ లాగా జరుపుకునే ఈ వాలెంటైన్స్ డే అసలు ఎలా వచ్చింది.. వాలెంటైన్స్ డే వీక్ వెనుక అసలు సీక్రెట్స్ ఏమిటో తెలుసుకుందాం పదండి.
ముందుగా వాలెంటైన్స్ డే వీక్ 7 రోజులు రకరకాల పేర్లతో పిలుస్తారు కాబట్టి ఏ డేట్ లో ఏ రోజు జరుపుకుంటారు చూద్దాం..
వాలెంటైన్స్ డే వీక్ (వాలెంటైన్స్ వీక్ లిస్ట్ 2024)
7 ఫిబ్రవరి 2024- రోజ్ డే, బుధవారం
8 ఫిబ్రవరి 2024- ప్రపోజ్ డే, గురువారం
9 ఫిబ్రవరి 2024-చాక్లెట్ డే, శుక్రవారం
10 ఫిబ్రవరి 2024- టెడ్డీ డే, శనివారం
11 ఫిబ్రవరి 2024-ప్రామిస్ డే, ఆదివారం
12 ఫిబ్రవరి 2024- హగ్ డే, సోమవారం
13 ఫిబ్రవరి 2024-కిస్ డే, మంగళవారం
14 ఫిబ్రవరి 2024- వాలెంటైన్స్ డే, బుధవారం
లవ్ లో ఉన్న కాలేజ్ పిల్లల దగ్గర నుంచి కొత్తగా పెళ్లయిన జంటల వరకు ఈ వీక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నిజానికి, వాలెంటైన్స్ డే అనేది మనకు సంబంధించిన పండుగ కాదు. అయితే ఈ పండుగ జరుపుకోవడానికి వెనుక చాలా కథనాలు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాచుర్యం పొందిన కథ మాత్రం సెయింట్ వాలెంటైన్ కు సంబంధించింది.ఇది రోమన్ దేశానికి చెందినది.రోమన్ కింగ్ క్లాడియస్ టైం నుంచి ఈ ఆచారం స్టార్ట్ అయింది.
కింగ్ క్లాడియస్ నిర్ణయం తప్పు అని ప్రూవ్ చేయడానికి సెయింట్ వాలెంటైన్ ప్రయత్నించారు. రాజు మెరుగైన సైన్యాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో యువకులకు పెళ్లి లేకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. దీనికి నిరసనగా సెయింట్ వాలెంటైన్ ఎందరో అధికారులు, సైనికుల సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. దీంతో కోపం వచ్చినా రాజు సెయింట్ వాలెంటైన్ జైలులో బంధించి నాలుగు ఫిబ్రవరి ఉరితీసారు. ఆ తర్వాత క్రమంగా ఆయన మరణించిన ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఇండియాలో వాలెంటైన్స్ డే ..
భారతదేశంలో వాలెంటైన్స్ డే కి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. 1800 కాలంలో ఇండియాలోని ముస్సోరీలో ఇలాంటి కు సంబంధించిన మొగర్ మాంక్ బార్లోగంజ్లోని జాన్ మెకెనాన్ పాఠశాలలో లాటిన్ టీచర్ గా పని చేసేవారు. 1843 ఫిబ్రవరి 14న ఆయన ముస్సూరీ నుంచి ఇంగ్లాండ్ కు ఒక లవ్ లెటర్ పంపారు.వాలెంటైన్స్ డే రోజున మౌగర్ తాను లూయినను ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని లేక ద్వారా వ్యక్తం చేశారు. అప్పటి లేఖ 150 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది.
Also read: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook