త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టిన ఘటనపై భారత్‌కు బ్రిటన్ క్షమాపణ చెప్పింది. బుధవారం లండన్‌ పార్లమెంట్ సమీపంలో కొందరు నిరసనకారులు భారత త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టారు.  బ్రిటన్ పర్యటనలో సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా పాకిస్థాన్ ప్రేరేపిత ఖలిస్థాన్, కశ్మీరీ ఆందోళనకారులు పార్లమెంట్ స్క్వేర్ వద్దకు చేరుకుని అక్కడ ఎగురుతున్న భారత త్రివర్ణ పతాకాన్ని కిందికు లాగి తగలబెట్టారు. అనంతరం ఖలిస్థాన్ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు  పోలీసులు అక్కడే ఉండడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ సమక్షంలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినప్పటికీ బ్రిటన్ పోలీసులు మౌనంగా ఉండటంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ విదేశాంగ కార్యాలయం భారత్‌కు క్షమాపణలు తెలిపింది.  ఈ ఘటనకు చింతిస్తున్నమాని..ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా బ్రిటన్ హామీ ఇచ్చింది.