Aviation News: ఆ దేశానికి వెళ్లొద్దని అనధికారికంగా సూచించిన భారత ప్రభుత్వం!
India Vs China : గాల్వాన్ లోయలో జరిగిన ఘటన తరువాత భారత- చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా భారత ప్రభుత్వం విమానయాన సంస్థలకు అనదికారి సూచనలు జారీ చేసింది. భారతదేశంతో పాటు ఇతర విదేశీ విమానయాన సంస్థలను చైనా పౌరులను భారత దేశంలోకి తీసుకురావద్దు అని తెలిపినట్టు సమాచారం.

Also Read | Yearender 2020: ఈ ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...
భారత్ ఇలా చేయడానికి గల కారణం.. ఇటీవలే చైనా ప్రభుత్వం భారతీయులు ఆ దేశంలోకి ప్రవేశించకుండా విమాన సంస్థలకు సూచనలు జారీ చేశారు.
ప్రస్తుతానికి భారత్ (India) చైనా మధ్య విమాన ప్రయాణాలను నిలిపివేశారు. ఫారిన్ కోటాలో భాగంగా అత్యవసర సేవల్లో పని చేసే చైనా పౌరులకు మాత్రమే భారత్‌లో ప్రవేశం ఉంటుంది. ఇటీవలే బయోబబుల్‌లో సురక్షిత విధానంలో కొంత మంది చైనా వాసులు భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. వీరిలో చాలా మంది యూరోప్ లేదా ఇతర బయోబబుల్ ఉన్న దేశాల నుంచి వచ్చారు.
Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!
చైనా (China) పౌరులు భారత్‌లోకి ప్రవేశించకుండా వీసా అనుమతులు రద్దు చేశారు. అయితే వ్యాపారం కోసం వస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని సమాచారం. ఈ కొత్త అనధికారిక నియమం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న చైనా పౌరులకు కొన్ని షరతులతో భారత్‌లో ప్రవేశించడానికి అనుమతినిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe