భారత ఈశాన్య సరిహద్దుల్లో తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతున్న మన చిరకాల శ్రతు దేశం చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ భారీ స్కెచ్ రెడీ చేసింది. ఈ వ్యూహంలో భాగంగా  బ్రహ్మపుత్రా నది కింద సొరంగం తవ్వాలని భావిస్తోంది.  ఈ విషయంలో పక్కా నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 
సోరంగం అవసరమమేంటి ?
సైనిక మోహరింపునకు అసోం సరిహద్దు కీలక ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే బ్రహ్మాపుత్ర నదిని దాటి వెళ్లాల్సిన పరిస్థితి. రుతుపవనాల సమయంలో బ్రహ్మాపుత్ర నది ప్రవాహం కారణంగా స్థానికంగా ఉన్న రోడ్డు మార్గంపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నది  గర్భం నుంచి సొరంగం తీయడమే శాశ్వత పరిష్కారమని అభిప్రాయపడ్డ నిపుణులు... దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించగా దీనికి భారత ప్రభుత్వం ఓకే చెప్పిందట. 
అసలు ప్లాన్ ఇది...!!
నదీ గర్భంలో 30 మీటర్లు లేదా అంతకంటే కింద సొరంగాన్ని నిర్మించడం ద్వారా సైనిక దళాలను ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా తరలించవచ్చని తెలుస్తోంది. అలాగే సొరంగం నిర్మించడం ద్వారా శత్రు దాడుల భయం కూడా ఉండదు. భద్రతా దళాలు సురక్షితంగా సరిహద్దుల వరకూ చేరుకునే వీలుంటుంది. తేజ్‌పూర్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది వెడల్పు దాదాపు పన్నెండు కి.మీ ఉంటుంది. ఇదే బ్రహ్మపుత్ర నదికి అతి తక్కువ వెడల్పు. దీంతో  సొరంగాన్ని తేజ్‌పూర్ జిల్లాలోనే నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.