Aviation fuel: `ఆవాల నూనె`తో విమాన ఇంధనం..భారతీయ శాస్త్రవేత్త ఘనత!
Aviation fuel: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో.. విమానాల ఇంధన ఖర్చులు ఎయిర్‌లైన్స్ సంస్థలకు పెనుభారంగా మారాయి. అయితే ఇంధనం ఖర్చును తగ్గించేందుకు ఓ భారత శాస్త్రవేత్త నేతృత్వంలోని పరిశోధకులు బృందం శుభవార్త చెప్పింది. ఆవాల మొక్కల నుంచి తీసిన నూనెతో విమాన ఇంధనాన్ని తయారు చేయవచ్చని పేర్కొంది.
Aviation fuel: విమానం నడవాలంటే..ఇంధనం చాలా ముఖ్యం. కరోనా కారణంగా ఇంధనం ఖర్చులు విపరీతంగా పెరిగి..విమానయాన రంగం(Aviation sector) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇటువంటి తరుణంలో..భారతీయ శాస్త్రవేత్త పునీత్ ద్వివేది(Puneet Dwivedi) నేతృత్వంలోని పరిశోధకుల బృందం గుడ్ న్యూస్ చెప్పింది.
బ్రాసికా కేరినాటా(Brassica carinata) రకం ఆవాల మొక్కల నుంచి తీసిన నూనె నుంచి విమాన ఇంధనం తయారుచేయవచ్చని పేర్కొంది. దీంతో ఇంధన ఖర్చులు తగ్గడంతోపాటు విమాన ఇంధనాల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను 68శాతం తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు జీసీబీ బయోఎనర్జీ జర్నల్‌లో ప్రచురితమైమయ్యాయి.
Also Read: Billgates Daughter Marriage: బిల్‌గేట్స్ కుమార్తె జెన్నిఫర్ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా
చౌక మరియు పర్యావరణ హితం
‘‘అమెరికా(America) వ్యాప్తంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో(Carbon Emissions) 2.5శాతం విమానయాన రంగానిదే. గ్లోబల్ వార్మింగ్(global Warming)లో దీని పాత్ర 3.5శాతంగా ఉంది. కేరినాటా రకానికి చెందిన ఆవాల మొక్కలతో తయారు చేసే విమాన ఇంధనం కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఆవాల మొక్కతో లీటర్ ఇంధనం ఉత్పత్తి చేయడానికి కేవలం 0.12 డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది చమురు ఇంధనంతో పోలిస్తే చాలా తక్కువ. ఈ ఇంధనం ఉత్పత్తికి అవసరమయ్యే ముడిసరుకులు, ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే.. ఈ ఎకో ఇంధనాన్ని నిరంతరం ఉత్పత్తి చేస్తాం’’ అని యూఎస్‌లోని జార్జియా యూనివర్సిటీ(University of Georgia)లో వార్నెల్ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ న్యాచురల్ రీసోర్సెస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న పునీత్ ద్వివేది తెలిపారు.
నాలుగేళ్లుగా పరిశోధనలు
అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్.. 15 మిలియన్ డాలర్లతో ‘సౌత్‌ఈస్ట్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిన్యూవబుల్స్ ఫ్రమ్ కేరినాటా’అనే ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఈ ప్రాజెక్టులో పునీత్ ద్వివేది కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత నాలుగేళ్లుగా యూఎస్ ఆగ్నేయ అమెరికాలో కేరినాటా రకం ఆవాల మొక్కలను పెద్ద మొత్తంలో ఏ విధంగా పెంచాలి, వాటి నుంచి నూనె ఎలా సేకరించాలనే విషయంపై పరిశోధలు చేస్తున్నారు.
Also Read: Water Pollution: ఆ దేశంలో భూగర్భ జలాల్లో కిరోసిన్, డీజిల్ గుర్తింపు, ఆ నీరు తాగవద్దని హెచ్చరికలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి