అమెరికాలో దారుణం.. భారత సంతతి యువకుడిపై 50 సార్లు సుత్తితో దాడి.. అసలేం జరిగిందంటే..?
Indian Student: 25 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన యువకుడిని, యుఎస్‌లో కొందరు రోజుల తరబడి ఆశ్రయం కల్పించి మరీ హత్య చేశారు. ఫాల్క్‌నర్ అనే వ్యక్తి సైని అనే యువకుడిపై తలపై ముఖంపై దాదాపు 50 సార్లు కొట్టాడు. దీంతో 25 ఏళ్ల సైనీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
Youth Killed in America: అమెరికాలో తరచుగా జాత్యహాంకార ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొందరు దుండగులు కావాలని భారతీయులను హతమార్చిన ఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. తాజాగా, మరో ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని జార్జియాలోని ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో వివేక్ సైనీ అనే 25 ఏళ్ల భారతీయ విద్యార్థి పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. జనవరి 16న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఛానెల్ WSB-TV ప్రకారం.. మిస్టర్ సైనీని కొందరు దుకాణం నుండి బయటకు రమ్మని పిలిచారు. ఆ తర్వాత మాట్లాడుతు ఒక్కసారిగా సుత్తితో దారుణంగా కొట్టి దాడిచేశారు. ఈ క్రమంలో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
Read Also: Bihar: ''నితీష్ కుమార్ ఆయా రామ్ గయా రామ్ లాంటి వాడు".. సెటైర్ లు వేసిన మల్లికార్జున ఖర్గే..
మిస్టర్ సైనిపై దాడి చేసింది అతనికి సహయం చేసిన వ్యక్తి జూలియన్ ఫాల్క్ నర్ సమాచారం. కాగా, దుకాణం దగ్గర.. సోమవారం రాత్రి, మిస్టర్ సైనీ ఫాల్క్‌నర్‌కు తాను వెళ్లిపోవాలని, లేకపోతే పోలీసులను పిలుస్తానని చెప్పాడు. విద్యార్థి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఫాల్క్‌నర్ అతనిపై సుత్తితో దాడి చేసి 'తలపై ముఖంపై దాదాపు 50 సార్లు కొట్టాడు.
ఈక్రమంలో.. 25 ఏళ్ల సైనీ యువకుడు ''తీవ్రమైన గాయాలతో అపస్మారక స్థితిలోకి పోయి సంఘటనా స్థలంలో మరణించినట్లు సమాచారం. డికాల్బ్ కౌంటీ పోలీసుల ప్రకారం, లిథోనియాలోని చెవ్రాన్ గ్యాస్ స్టేషన్‌లో దాడి గురించి 12:30 గంటలకు అధికారులకు కాల్ వచ్చింది.
వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫాక్స్ న్యూస్ అట్లాంటా ప్రకారం అతని నుండి రెండు కత్తులు, మరొక సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, సదరు యువకుడు.. బీటెక్ పూర్తి చేసి రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన ఆ విద్యార్థి ఇటీవల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ సాధించాడు. ఇంతలో, ఫాల్క్‌నర్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పట్ల భారతీయ ఎంబసీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook