Rice ban india: బియ్యం ఎగుమతులపై నిషేధం.. ఆ దేశంలోని ఎన్నారైలు అవస్థలు..
Rice ban india: పెరుగుతున్న ధరలను అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్రం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఇది ఎన్నారైలపై తీవ్ర ప్రభావం చూపింది. వీరు బియ్యం కోసం ఎగబడ్డ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Indian rice export ban affects: దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బియ్యంపై నిషేదం విధించింది. దీని ప్రభావం అమెరికా, కెనడా వంటి దేశాల్లో కనిపించింది. బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతిపై భారత్ బ్యాన్ విధించిందనే తెలియగానే యూఎస్ లో ఉన్న ఎన్నారైలు బియ్యం కోసం ఎగబడ్డారు. రైస్ ధరలు పెరుగుతాయోనని అనుమానంతో కొందరు కొన్ని నెలలకు సరిపడా బియ్యాన్ని కొనుగోలు చేశారు. దీన్ని అదునుగా చేసుకున్న అక్కడి సూపర్ మార్కెట్లు బియ్యం ధరలను అమాంతం పెంచేశాయి. 18 డాలర్లుగా ఉండే 20 పౌండ్ల బియ్యం బ్యాగ్ ధరను ఏకంగా 50 డాలర్లకు పెంచి విక్రయిస్తున్నట్లు పలువురు ఎన్నారైలు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఒకరికి ఒక బ్యాగే ఇస్తామని కొన్ని స్టోర్లు నోటీసు బోర్డును పెట్టాయి. కొన్ని చోటల నోస్టాక్ బోర్డులు సైతం దర్శనమిచ్చాయి.
విదేశాల్లో నివసించే భారతీయులు ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ఆహారంగా బియ్యాన్ని తింటారు. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధం విధించిందని తెలియగానే విదేశాల్లో ఉన్న భారతీయులు రైస్ కోసం పోటీపడ్డారు. దీంతో చాలా స్టోర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. కొన్ని స్టోర్ల వద్ద క్యూలైన్ల దర్శనమిస్తే.. మరికొన్ని చోట్ల బియ్యం కోసం ప్రజలు ఎగబడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి.
Also Read: Earthquake: అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు..
ఇండియా నుంచి వివిధ దేశాలకు 18 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో ఏడు మిలియన్ టన్నులు తెల్ల బియ్యం ఎగుమతులే. ఈ ఎగుమతులలో 10 నుండి 15% ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండే జరుగుతున్నాయి. యూఎస్ వినియోగించే బియ్యంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ భారత్ నుండి దిగుమతి చేసుకుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook