Astro Tips: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివిధ రాశుల పరివర్తనం లేదా గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. అదే విధంగా రానున్న 30 రోజులు ఈ 5 రాశులవారికి అత్యంత క్లిష్టమైన సమయంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ 30 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Astro Tips: జ్యోతిష్యం ప్రకారం మల్మాస్ నెల ప్రారంభమై..ఖప్పర్ యోగం ఏర్పడిందంటారు. హిందూ జ్యోతిష్యం ప్రకారం ఈ యోగానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ యోగం కారణంగా ఏయే రాశులకు కష్టంగా ఉంటుందో తెలుసుకుందాం..
కన్యారాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి జాతకుల జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. జీవిత భాగస్వామితో గొడవ రావచ్చు. జీవితమే సమస్యాత్మకం కావచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో ఘర్షణలు ఎదురయ్యే పరిస్థితి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చిక రాశి జ్యోతిష్యం ప్రకారం వృశ్చిక రాశి జాతకులకు ఈ నెల చాలా కష్టంగా ఉంటుంది. కుటుంబంలో సైతం చాలా ఇబ్బందులు రావచ్చు. వ్యాపారం సరిగ్గా లేకపోవడంతో ఆర్దిక ఇబ్బందులు వెంటాడుతాయి. లావాదేవీలు నిలిచిపోవచ్చు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి.
మీన రాశి మీన రాశి జాతకులకు ఖప్పర్ యోగంతో కష్టాలు ఎదురుకావచ్చు. చేసే పనిలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమస్యలు ఎదురుకావచ్చు. కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారి ఇబ్బంది కల్గించవచ్చు. ఉద్యోగస్థులకు తీవ్రమైన నిరాశ తప్పదు. వ్యాపారంలో ఆశించినమేర లాభాలుండవు
మిధున రాశి జ్యోతిష్యం ప్రకారం మిధున రాశి జాతకులపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. ఉద్యోగస్థులకు చాలా ఇబ్బంది కల్గించే పరిణామం. ఆర్ధికంగా ఇబ్బందులు వెంటాడుతాయి.
కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు ఆర్ధిక ఇబ్బందులు పెరుగుతాయి. ఆదాయం తగ్గి ఖర్చులు పెరగడమే ఇందుకు కారణం. వ్యాపారంలో సైతం నష్టాలు ఎదురౌతాయి. కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సైతం విభేధాలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతత దూరమౌతుంది.