Indonesia flight incident: అదృశ్యమైన ఇండోనేషియా విమానం సముద్రంలో కూలినట్టు నిర్ధారణైంది. టేకాఫ్ అయిన కాస్సేపటికే జావా సముద్రంలో పడిపోయినట్టు అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడిక సముద్రంలో  గాలింపు తీవ్రమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండోనేషియా ( Indonesia ) శ్రీ విజయ సంస్థ ( Sriwijaya air ) కు చెందిన ఎయిర్ బోయింగ్ 737 ( Air Boeing 737 ) విమానం జకార్తా నుంచి  బోర్నియో ఐలాండ్ కు బయలుదేరిన కాస్సేపటికే అదృశ్యమైంది. సిబ్బందితో కలిపి 62 మంది ప్రయాణీకులున్న విమానం కోసం అణ్వేషణ ప్రారంభమైంది. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. చివరికి జావా సముద్రంలో ఈ విమానం పడిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. సముద్రంలో విమాన శకలాలు కూడా లభ్యమయ్యాయి. జావా సముద్రం ( Java sea ) లోనే పడిపోయినట్టు నిర్ధారణ కావడంతో ఇక గాలింపు ముమ్మరం చేశారు.


జకార్తా ( Jakarta )నుంచి టేకాఫ్ అయిన కాస్సేపటికే ప్యాసెంజర్ జెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు తెగిపోయాయి. రాడార్ డేటాబాక్స్ ప్రకారం 2 గంటల 40 నిమిషాలకు ఏటీసీతో సంబంధం కోల్పోయింది. ఇప్పుడీ ఘటనపై నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. ప్రత్యేక సహాయక కేంద్రాల్ని ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. 


Also read: Indonesian flight: విమానం ఆచూకీ గల్లంతు.. సముద్ర జలాల్లో విమాన శకలాలు