Interesting Facts About Rishi Sunak: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్‌కి ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటున్న రిషి సునక్ ముందు బాధ్యతతో వచ్చే ఆనందం కంటే సవాళ్లే ఎక్కువగా ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ఇప్పుడు రిషి సునక్ ముందున్న అతి పెద్ద బాధ్యత.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిషి సునక్ మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు.. ప్రపంచ ఐటి కంపెనీల్లోనే మేటి అయిన ఇన్ఫోసిస్ కంపెనీ ఫౌండర్స్‌లో ముఖ్యుడైన నారాయణ మూర్తికి అల్లుడు కూడా. రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు భారత్‌తో ఉన్న సంబంధాలు, ఆసక్తికరమైన అంశాలు గురించి తెలుసుకుందాం. 


1) బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారిగా భగవద్గీతపై ప్రమాణం చేసి ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తి కూడా రిషి సునకే కావడం గమనార్హం. యార్క్‌షైర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఈ ఘట్టం చోటుచేసుకుంది.


2) రిషి సునక్ తల్లిదండ్రులు ఇద్దరూ భారత సంతతి మూలాలు ఉన్న వాళ్లే. వృత్తిరీత్యా ఫార్మసిస్టులు అయిన రిషి తల్లిదండ్రులు 1960 లలో తూర్పు ఆఫ్రికా నుండి బ్రిటన్‌కి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.


3) ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్న రిషి సునక్‌కి క్రిష్ణ, అనౌష్క అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 


4) రిషి సునక్ కి భారత దేశమన్నా.. భారత దేశం సంప్రదాయాలన్నా అమితమైన గౌరవం. అందుకే దీపావళి సహా అన్ని భారతీయ పండగలను సెలబ్రేట్ చేసుకోవడానికి రిషి ఇష్టపడుతుంటారు. భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలు గురించి తన తల్లిదండ్రులు తనకు చెబుతుండే వారని పలు సందర్భాల్లో రిషి సైతం గుర్తుచేసుకున్నారు.


5) స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన రిషి సునక్.. గతంలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గానూ సేవలు అందించారు.


6) తన అత్తామామలను కలిసేందుకు రిషి సునక్ తన భార్యా పిల్లలతో కలిసి అప్పుడప్పుడు భారత్ వచ్చి వెళ్తుంటారు. తనకు ఉన్న బిజీ షెడ్యూల్లోనూ వారి కోసం సమయం కూడా కేటాయిస్తుంటారు.


7) ఈ ఏడాది వేసవిలో ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన రిషి సునక్‌పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. రిషి విలాసవంతమైన జీవితం, ఖరీదైన బంగ్లా, ఖరీదైన బూట్లు.. ఇలా పలు అంశాలు ఆయనపై విమర్శలకు దారితీశాయి. అయితే, తాను ఎప్పుడైనా మానసిక ఒత్తిడికి గురైతే.. ఆ సమయంలో భగవద్గీత చదివి ఒత్తిడి తగ్గించుకుంటానని చెప్పడం గొప్ప విషయం.


8) రిషి సునక్ నెట్ వర్త్ విలువ 700 మిలియన్ పౌండ్స్. బ్రిటన్ అంతటా ఆయనకు ఖరీదైన బంగ్లాలు, ఎస్టేట్స్, ఇతర ఆస్తులు ఉన్నాయి.


9) రిషి సునక్‌కి, చాలా మంది భారతీయులకు ఉండే మరో కామన్ కనెక్షన్ క్రికెట్. శారీరకంగా ఫిట్‌గా ఉండటం కోసం రిషి సునక్ క్రికెట్ ఆడటానికి ఇష్టపడతారు.


Also Read : Liz Truss Quits: బ్రిటన్ ప్రధాని పోటీలో మళ్లీ భారతీయుడు.. రేసులో ఉన్నది వీళ్లే..!


Also Read : Liz Truss Resignation: బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా


Also Read : PV Narasimha Rao Statue: విదేశీ గడ్డపై తొలిసారిగా భారత మాజీ ప్రధాని విగ్రహం.. వీవీ నరసింహ రావుకే దక్కిన అరుదైన గౌరవం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి