Liz Truss Quits: బ్రిటన్ ప్రధాని పోటీలో మళ్లీ భారతీయుడు.. రేసులో ఉన్నది వీళ్లే..!

Rishi Sunak UK PM Contender: బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో తదుపది ప్రస్తుతం అందరి కళ్లు మరోసారి రిషి సునక్‌పై పడ్డాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 11:18 AM IST
  • బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా
  • యూకేలో మరోసారి రాజకీయ సంక్షోభం
  • ప్రధాని పదవి రేసులోకి రిషి సునక్
Liz Truss Quits: బ్రిటన్ ప్రధాని పోటీలో మళ్లీ భారతీయుడు.. రేసులో ఉన్నది వీళ్లే..!

Rishi Sunak UK PM Contender: బ్రిటన్ ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ గురువారం రాజీనామా చేశారు. దీంతో యూకేలో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తదుపరి ప్రధాని ఎవరు అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందరి కళ్లు ప్రవాస భారతీయుడు, బ్రిటన్ మాజీ ఛాన్సెలర్ రిషి సునక్‌పైనే ఉన్నాయి. సెప్టెంబర్‌లో జరిగిన ప్రధాని పోటీలో చివరి వరకు పోరాడి.. లిజ్ ట్రస్ చేతిలో ఓటమి చెందిన రిషి సునక్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 

తాజాగా ప్రధానిగా లిజ్ ట్రస్ తప్పుకోవడంతో మరోసారి రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సునక్‌తో పాటు మాజీ క్యాబినెట్ మంత్రి పెన్నీ మోర్డాంట్, డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ కూడా రేసులో ఉన్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా మరోసారి పోటీ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి నియమితులైన కొత్త ట్రెజరీ చీఫ్‌ జెరెమీ హంట్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.

ప్రధానిగా పోటీ పడే అభ్యర్థి శాసనసభ్యుల నుంచి 100 నామినేషన్లు తప్పనిసరిగా పొందాలని సీనియర్ కన్జర్వేటివ్ శాసనసభ్యుడు గ్రాహం బ్రాడీ తెలిపారు. రేసు వచ్చే శుక్రవారంతో ముగుస్తుందని చెప్పారు. 
గత ఆరేళ్లలో ఐదో బ్రిటన్ ప్రధానిగా కొత్త వ్యక్తి రానున్నారు. 

కన్జర్వేటివ్ లీడర్‌షిప్ రేసులో రిషి సునక్ గత రేసు చివరి వరకు పోటీలో నిలబడి.. రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. లిస్ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా.. సునక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. మరోసారి రిషి సునక్ ప్రముఖంగా వినబడుతున్నా.. కన్జర్వేటివ్ పార్టీలో అంతర్గత సంక్షోభంతో ఎవరైనా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. 
 
అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వానికి నిరసనగా రిషి సునక్ జూలైలో ట్రెజరీ చీఫ్‌గా రాజీనామా చేశారు. ఆ తరువాత ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో తన పదవి పోయేందుకు కారణమైన రిషి సునక్‌ను ఓడించేందుకు బోరిస్ జాన్సన్ వ్యతిరేకంగా ప్రచారం చేసి లిజ్ ట్రస్‌ను గెలిపించారు. ఇప్పుడు ఆమె రాజీనామా చేయడంతో మరోసారి తానే పోటీ చేయాలని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు. ఒకవేళ తాను గెలవలేని పరిస్థితి ఉంటే.. కచ్చితంగా రిషి సునక్‌ను ఓడించేందుకు ప్రయత్నించడం గ్యారంటీ. మనల్ని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన భారతీయుడు పరిపాలించాలని భారతీయులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.   

రిషి సునక్‌కు పెన్నీ మోర్డాంట్, బెన్ వాలెస్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మోర్డాంట్ మొన్న ఎన్నికల్లో మూడవ స్థానంలో నిలిచారు. పార్టీ విభేదాలను సమన్వయం చేసేందుకు ఆమె సరైన అభ్యర్థి అని కొందరు భావిస్తున్నారు. బ్రెగ్జిట్ అనుకూల ప్రచారంలో మోర్డాంట్ కీలక పాత్ర పోషించారు. 2019లో బ్రిటీష్ డిఫెన్స్ సెక్రటరీగా పనిచేశారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళగానూ నిలిచారు. 

బెన్ వాలెస్‌కు కన్జర్వేటివ్ పార్టీలో మంచి పేరు ఉంది. తన పదునైన మాటలతో చాలా మంచి మనసులు గెలుచుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సమయంలో బ్రిటన్ ప్రభుత్వ వాయిస్‌ను వాలెస్ గట్టిగా వినిపించారు. ఇక మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రేసులోకి రానుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. వచ్చే వారంలో బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరేది తేలిపోనుంది. 

Also Read: Ginna Movie Twitter Review : జిన్నాకు మొదటి రోజే ఎదురుదెబ్బ?

Also Read: Liz Truss Resignation: బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News