Support India: మహమ్మారి కరోనా వైరస్‌పై పోరులో భాగంగా అత్యవసర వైద్య పరికరాలను, సామగ్రిని అందజేయడంతోపాటు భారత్‌కు అన్ని విధాలా అండగా నిలుస్తామని పలు దేశాలు ముందుకొచ్చాయి. ఆక్సిజన్, వైద్య పరికరాలు, వ్యాక్సిన్ ముడి పదార్ధాలు, పీపీఈ కిట్లు అందించేందుకు ఆ దేశాలు సంసిద్ధత  తెలిపాయి. ఇప్పటికే కొన్ని దేశాల్నించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా మహమ్మారి (Corona virus) భయంకరంగా మారి విస్తరిస్తోంది. రోజులు 3.5 లక్షల కేసులు నమోదవుతున్న పరిస్థితి. రోజురోజుకూ కరోనా సంక్రమణ శరవేగంగా మారుతోంది. ఈ నేపధ్యంలో దేశంలో ఆక్సిజన్ ( Oxygen Shortage), మందుల కొరత తీవ్రమైంది. కరోనా తీవ్ర పరిస్థితుల్లో ఉన్న ఇండియాను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. 318 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో ( Oxygen Concentrators) కూడిన ఎయిర్ ఇండియా విమానం అమెరికా నుంచి ఇండియాకు చేరింది. మరోవైపు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ( Covishield vaccine) ముడిపదార్దాల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి..ముడి సరుకుల్ని సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు  ( Serum Institute ) అందిస్తామని అమెరికా ప్రకటించింది.ఇక కోవిడ్ చికిత్సకు అవసరమైన మందులు, ర్యాపిడ్ డయాగ్నిస్టిక్ కిట్స్, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు, అమెరికా వైద్య నిపుణుల్ని అందిస్తామని తెలిపింది. కరోనా విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్, మందులు అందిస్తామని 27 ఈయూ దేశాలు స్పష్టం చేశాయి.


ఇండియాలో కరోనా కేసుల తీవ్రతను హృదయ విదారక పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అభివర్ణించింది. ఈ నేపధ్యంలో వేల సంఖ్యలో పోర్టబుల్ ఆక్సిజన్ మిషన్ల ( Portable Oxygen Machines) తో పాటు అత్యవసర సామగ్రి పంపిస్తున్నట్టు డబ్ల్యూహెచ్వో తెలిపింది. భారత ప్రభుత్వానికి సహాయంగా 2 వేలమంది వైద్య సిబ్బందిని కూుడా పంపిస్తున్నట్టు పేర్కొంది. ఇండియాకు అవసరమైన వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ( Oxygen Concentrators) పంపిస్తున్నట్టు యూకే ప్రకటించింది. వారంలో రోజుల్లోగా ఇండియాకు యూకే నుంచి 495 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 120 నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్లు, 20 మ్యాన్యువల్ వెంటిలేటర్లు పంపుతామని వెల్లడించింది.ఇక ఆస్ట్రేలియా కూడా ఇండియాకు మద్దతు అందిస్తామని ముందుకొచ్చింది. భారత్‌కు కావల్సిన ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపుతామని ఆస్ట్రేలియా తెలిపింది. ఫ్రాన్స్ నుంచి ఇప్పటికే లిక్విడ్ ఆక్సిజన్ ఇండియాకు రానుంది. దాంతోపాటు ఆక్సిజన్ జనరేటర్, ఐసీయూ పరికరాలు, 28 వెంటిలేటర్లు రానున్నాయి.


Also read: Google and Microsoft: ఇండియాకు సహాయం అందించనున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook