International Cat Day 2022: టైటిల్ చూడగానే అవాక్కయ్యారా.? అయ్యే ఉంటారులెండి. ప్రతి కుక్కకూ.. ఓ రోజు ఉన్నట్లే ప్రతి పిల్లికీ ఓ రోజు ఉంది. అదే ఆగస్ట్ 8 ఇంటర్నేషనల్ క్యాట్ డే. ఇది.. 2002 లో ప్రారంభమైంది. జంతువుల సంరక్షణ కోసం( International Fund For Animal Welfare దీనిని ప్రారంభించింది. అప్పటి నుంచి.. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 8న.. వరల్డ్ వైడ్ ఈ క్యాట్ డేని జరుపుకోవడం ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశమేమిటంటే.. పిల్లులను రక్షించడంతో పాటు వాటికి సహాయం అందించడం. వీటితో పాటు అవి పడే ఇబ్బందులపై ప్రజలకు అవగాహన కల్పించడం. ఈ అంతర్జాతీయ పిల్లుల దినోత్సవాన్ని భారతదేశంలోనూ జరుపుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాట్ డేకు సంబంధించి కొన్ని ప్రత్యేకతలు:


ప్రపంచవ్యాప్తంగా క్యాట్ డే జరుపుకుంటున్నా.. వేడుకల విషయంలో కొన్ని దేశాల్లో తేడాలున్నాయ్. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. జపాన్‌లో క్యాట్ డే‌ను ఫిబ్రవరి 22న జరుపుకుంటారు. అదే రష్యాలో అయితే.. క్యాట్ డేను.. మార్చి 1న జరుపుకుంటారు. అమెరికా విషయానికొస్తే అక్కడ పిల్లుల దినోత్సవాన్ని అక్టోబర్ 29న సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ.. ప్రపంచంలోని చాలా దేశాల్లో.. క్యాట్ డేని ఆగస్ట్ 8న మాత్రమే జరుపుకుంటారు.


చాలా మంది ఇళ్లలో కుక్కల తర్వాత పిల్లులే పెంపుడు జంతువులుగా కనిపిస్తాయ్. అవి కూడా.. చాలా తొందరగా మనుషుల్లో కలిసిపోతాయ్. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా.. అవి ఇబ్బంది పడకుండా.. జన సమూహంలో చాలా సౌకర్యవంతంగా జీవిస్తుంటాయ్. పిల్లులు కూడా చూడటానికి చాలా ముద్దుగా ఉంటాయ్. అందువల్ల.. ఈ మధ్యకాలంలో పిల్లులను పెంచుకోవాలన్న ఆలోచన కూడా వేగంగా పెరిగింది. పిల్లుల్లోనూ  చాలా మార్పులు వచ్చాయి. సమాజంలో ఇట్టే కలిసిపోతున్నాయ్.


ఇంటర్నేషనల్ క్యాట్ డే రోజు చేయాల్సిందేమిటి?


మీకు సమీపంలో ఎక్కడైనా పిల్లి ఒంటరిగా కనిపిస్తే దానిని రక్షించండి. కుక్కలు, ఇతర జంతువుల నుంచి దానిని.. సురక్షితంగా ఉంచేలా చర్యలు తీసుకోండి. ఇప్పటికే.. మీరు పిల్లిని పెంచుకుంటున్నట్లైతే.. దాని భద్రత కోసం మెడకు జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చండి. దీని ద్వారా అది తప్పిపోయినప్పుడు మీ నుంచి దూరంగా వెళ్లిపోయినప్పుడు..  గుర్తించడం సులువు అవుతుంది. ఇవాళ క్యాట్ డే కాబట్టి.. ఈ రోజు మీ పిల్లి బర్త్ డే అని ఫీలై.. దానికో స్పెషల్ గిఫ్ట్ కూడా ఇవ్వొచ్చు. మీ పెట్ క్యాట్‌తో.. ఫన్నీగా ఓ ఫోటో తీసుకొని.. #InternationalCatDay హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయండి. అంతర్జాతీయ పిల్లి దినోత్సవం రోజు సరదాకా మీ క్యాట్‌తో వాక్‌కి కూడా వెళ్లండి.


Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!


Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook