డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు వారెంట్ జారీ..
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమాని హత్యకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే డోనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసింది. తమ టాప్ కమాండర్
న్యూఢిల్లీ: ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమాని హత్యకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే డోనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసింది. తమ టాప్ కమాండర్ ఖాసిం సొలేమాని హత్యకు సంబంధించి ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు సహకరించాలని ఇంటర్ పోల్ ను కోరింది. కనీసం రెడ్ నోటీసునైనా జారీ చేయాలని విన్నవించింది. మరోవైపు ఈ అంశంపై స్పందించేందుకు ఇంటర్ పోల్ చీఫ్ లియోన్ నిరాకరించారు. Tik Tok, UC Browser: టిక్ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం
Also Read: Sushant Singh Rajput: సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో సంచలన ట్విస్ట్..
అతికిరాతకంగా బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద సొలేమానీని డ్రోన్ల ద్వారా అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక ట్రంప్ తో పాటు మరో 30 మంది పాత్ర ఉందని ఇరాన్ ప్రాసిక్యూటర్ అలీ తెలిపారు. ట్రంప్ సహా నిందితులపై హత్య, ఉగ్రవాద అభియోగాలను మోపినట్టు వెల్లడించారు. డోనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయనను అరెస్ట్ చేయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే ఇరాన్ తీసుకున్నఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కావడంతో దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.
Also Read: Amazon అమెజాన్ ఉద్యోగుల సమ్మెకు కారణం అదేనా….
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ