కార్మికుల భద్రత అక్కడ కూడా ప్రశ్నార్ధకమౌతోంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఈ కామర్స్ సంస్థ ( E-commerce company ) అమెజాన్ (Amazon) లో ఉద్యోగులు నిరసనకు దిగారు. కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) బారిన పడినా సరే...సంస్థ ఆదుకోవడం లేదంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
ఈ కామర్స్ మార్కెట్ ( E commerce market ) లో ప్రఖ్యాత కంపెనీగా ఉన్న అమెజాన్ సంస్థకు అమెరికా తరువాత అతిపెద్ద మార్కెట్ జర్మనీ. ఇప్పుడీ దేశంలో ఆ సంస్థకు కష్టాలెదురయ్యాయి. జర్మనీలోని అన్ని బ్రాంచ్ ల ఉద్యోగులు 48 గంటల సమ్మెకు దిగుతున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో ఆ సంస్థ ఉద్యోగులు కూడా కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డారు. అయితే సంస్థ మాత్రం ఉద్యోగులకు ఆర్ధిక సహాయం అందించడం లేదని...కనీసం పట్టించుకోవడం లేదనేది వారి ఆవేదనగా ఉంది. Also read: Russian victory day parade: రష్యన్ విక్టరీ డే పేరేడ్‌లో ఇండియా దేనికి సంకేతం ?
గుడ్ అండ్ హెల్తీ వర్క్ నినాదంతో ఈ సమ్మె 48 గంటల పాటు కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కరోనా సంక్షోభ సమయంలో ( corona pandemic ) సైతం కంపెనీ స్వప్రయోజనాలు, లాభాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. జర్మనీలో ( Amazon Germany) ఆ సంస్థల్లో పనిచేస్తున్న 30-40 మందికి కరోనా సోకినట్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధైన ఓర్హాన్ అక్మాన్ తెలిపారు.
Also read: Maharashtra మహారాష్ట్రలో జూలై 31 వరకూ లాక్ డౌన్
ఖండించిన అమెజాన్ సంస్థ
అయితే ఈ ఆరోపణలన్నింటినీ అమెజాన్ సంస్థ ( Amazon company) ఖండించింది. సంస్దకు చెందిన ఉద్యోగులు, వినియోగదార్ల భద్రత దృష్ట్యా జూన్ వరకూ 4 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టామని స్పష్టం చేసింది. ఇప్పటికే 21 మిలియన్ల గ్లవ్స్, 18 మిలియన్ల ఫేస్ మాస్కులుతో పాటు 39 మిలియన్ల ఇతర రక్షణ సామగ్రిని అందించినట్టు ఆ సంస్థ జర్మనీ ప్రతినిధి తెలిపారు. Also read : Metro rail: మెట్రోరైలును అప్పుడే వద్దంటున్న జనం