Drone Attack In Iraq: ఇరాక్​ ప్రధానమంత్రి ముస్తాఫా అల్​-కధామీపై ఆదివారం హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణహాని తప్పింది. దుండగులు ఆయన ఇంటిపై డ్రోన్​ దాడులకు యత్నించి విఫలమయ్యారు. బాగ్దాద్‌లోని ముస్తాఫా నివాసంపై పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్​ దాడికి దుండగులు విఫలయత్నం చేశారని ఇరాక్​ సైన్యం తెలిపింది. అయితే.. ఆయనకు ఎలాంటి హాని జరగలేదని, క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ఈ దాడులకు పాల్పడినవారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు.. ప్రధాని ముస్తాఫా కూడా ట్విట్టర్​ వేదికగా తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు.


“రాకెట్​ దాడులతో ప్రజల నమ్మకాన్ని ఎవరూ వమ్ము చేయలేరు. ప్రజల భద్రత కోసం, న్యాయాన్ని సాధించడానికి, చట్టాన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్న మన వీరోచిత భద్రతా దళాల దృఢత్వం, పట్టుదల ఏమాత్రం తగ్గదు. నేను బాగున్నాను. ప్రజలంతా సంయమనంతో ఉండాలని కోరుతున్నాను” అని ముస్తాఫా అల్-కధామీ ట్వీట్ చేశారు.


ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే... బాగ్దాద్​లో​ ప్రధాని నివాసం ఉన్న గ్రీన్​జోన్​ ప్రాంతంలో పెద్దఎత్తున కాల్పుల శబ్దం వినిపించిందని ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది.


Also Read: Covaxin Vaccine For Children: అమెరికాలోని చిన్నారులకూ కొవాగ్జిన్ టీకా.. త్వరలోనే అత్యవసర వినియోగానికి అనుమతి 


Also Read: Yemen Clashes: యెమెన్​లో ఆగని ఘర్షణలు...200 మంది మృతి! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook