Israel-Hamas Attacks: ఇజ్రాయిల్-హమాస్ మధ్య దాడులు ప్రతీకార దాడుల్లో వందలాది మంది మృతి
Israel-Hamas Attacks: దాడులు, ప్రతీకార దాడులతో ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాలు నలిగిపోతున్నాయి. రాకెట్ దాడులు, వైమానిక దాడులతో సాధారణ ప్రజానీకం మృత్యువాత పడుతున్నారు. హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది.
Israel-Hamas Attacks: ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయిల్ దేశంపై జరిపిన మెరుపుదాడికి తీవ్ర ఆస్థి, ప్రాణనష్టం సంభవించింది. ఇజ్రాయిల్ తేరుకునేలోగా 5 వేల రాకెట్లు ముప్పేట దాడి చేశాయి. భారీగా ప్రాణనష్టం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఇవాళ ఒక్కసారిగా కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేల కాకెట్లతో ఇజ్రాయిల్ భూభాగంపై మెరుపుదాడి నిర్వహించింది. సరిహద్దు పట్టణాల్ని లక్ష్యంగా చేసుకుని సాగిన దాడుల్లో చాలామంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలో చొరబడిన హమాస్ మిలిటెంట్లు సౌధారణ పౌరులపై విరుచుకుపడ్డారు. హమాస్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారని, 500 మందికిపైగా గాయపడ్డారని ఆ దేశ రెస్క్యూ సర్వీస్ వెల్లడించింది. హమాస్ మిలిటెంట్లు ఈ దాడిని ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ పేరుతో నిర్వహించింది. జవాబుదారీతనం లేని నిర్లక్ష్యపు కాలం ఇక ముగిసిందని, ప్రత్యర్ధులు అర్ధం చేసుకునేలా దేవుడి సహాయంతో అన్నింటికీ ముగింపు పలకాలని హమాస్ నాయకుడు మొహమ్మద్ దీఫ్ పిలుపునిచ్చారు.
హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ ప్రారంభించింది. గాజాలోని హమాస్ మిలిటెంట్ స్థావరాలు, సహకరిస్తున్నవారిపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్ ప్రతీకార దాడుల్లో పాలస్తీనాకు చెందిన 160 మంది మరణించారు. ఇది ఆపరేషన్ కాదని, తాము యుద్దంలో ఉన్నామని ఇజ్రాయిల్ దేశ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. హమాస్ గ్రూప్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందన్నారు.
గాజాలో 2007లో హమాస్ అధికారం చేపట్టినప్పట్నించి ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య చాలా దాడులు జరిగాయి. గాజా సరిహద్దును ఇజ్రాయిల్ మూసివేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇవాళ జరిగిన దాడిలో గాజా స్ట్రిప్, ఇజ్రాయిల్ సరిహద్దు పట్టణాలు, నగరాలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో, ఎంతమంది అమాయకులు బలి కానున్నారో అనేది ఆందోళనగా మారింది.
Also read: Afghanistan Earthquake 2023: భారీ భూకంపంతో వణికిపోయిన ఆఫ్ఘన్, వందలాదిమంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook