Israel Hamas war Latest Updates: హమాస్ తీవ్రవాద దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. గాజా ప్రాంతంలో తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు ఇప్పటికే భూతల దాడులు మొదలుపెట్టింది. గాజాలోని ప్రజలను ఒక వైపునకు వెళ్లాలని సూచిస్తూ.. బహుముఖ దాడులు ప్రారంభించింది ఇజ్రాయెల్ సైన్యం. భూ-జల-గాలి దాడిని ప్రారంభించింది. ఇద్దరు సీనియర్ హమాస్ కమాండర్లు వైమానిక దాడుల్లో మరణించారు. హమాస్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) త్వరలో గాజాపై గాలి, నీటి ద్వారా దాడి చేయడానికి సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికారి ఒకరు పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇజ్రాయెల్ గతంలో గాజా పౌరులందరికీ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో సరిహద్దు ప్రాంతాన్ని ఖాళీ చేయమని వారిని కోరింది. అంతేకాకుండా ఈ నెల 7న జరిగిన హమాస్ ఘోరమైన దాడుల తర్వాత తాము జరిపే భూతల దాడికి ముందు గాజా స్ట్రిప్‌లోని పౌరుల తరలింపును టెర్రర్ గ్రూప్ హమాస్ అడ్డుకుంటోందని.. ఇది ప్రజల మరణాల సంఖ్య పెరగడానికి దారితీస్తుందని ఐడీఎఫ్‌ ఆదివారం తెలిపింది.


ఐడీఎఫ్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. హమాస్ తమ పౌరులను ఖాళీ చేయవద్దని హెచ్చరికలు జారీ చేసిందని చెప్పారు. గాజా నుంచి ఖాళీ చేస్తున్న ప్రజలను వారు అడ్డుకుంటున్నారని తెలిపారు. వారు ఉత్తర భాగంలో ఉండడం కంటే గాజాకు దక్షిణాన ఉండడం చాలా ఉత్తమం అని పేర్కొన్నారు. కాగా.. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు ఇప్పటికే గాజా సరిహద్దును చుట్టుముట్టాయి. హమాస్ సైనిక స్థావరాలపై పూర్తి దాడిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఈ దాడులలో మరణించిన వారి సంఖ్య 5 వేలు దాటవచ్చని భావిస్తున్నారు.


తమ దాడులు హమాస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాత్రమేనని.. ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడమే తమ కర్తవ్యమని ఐడీఎఫ్‌ ఇప్పటికే వెల్లడించింది. గాజా ప్రజలపై యుద్ధం చేయడం తమ లక్ష్యం కాదని.. ఉత్తర ప్రాంతాన్ని ఖాళీ చేసి.. దక్షిణ భాగానికి వెళ్లాలని కోరారు. గాజాలో దాదాపు 120 మంది ఇజ్రాయెల్‌లు హమాస్‌ ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు ఇజ్రాయెల్ సైన్యం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధంలో మధ్య రెండు వైపులా 3 వేల మందికి పైగా మరణించారు.


Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు


Also Read: Motorola Edge 40 Neo Price: పిచ్చెకించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola Edge 40 Neo మొబైల్..డెడ్‌ చీప్‌ ధరకే మీ కోసం..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook