Israel Hamas War: సొరంగాల్లో దాక్కున్న ఉగ్రవాదులను లాక్కొచ్చేందుకు ఇజ్రాయెల్ నయా ప్లాన్.. దిమ్మతిరిగిపోద్దేమో..!
Israel Hamas War Latest Updates: గాజాలోని సొరంగాల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను బయటకు వచ్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం సరికొత్త ప్లాన్‌ను రూపొందించింది. ఏకంగా సొరంగాల్లోకి పైపుల ద్వారా పెద్ద ఎత్తును నీటిని పంప్ చేయాలని ప్రణాళికలు రచించింది.
Israel Hamas War Latest Updates: ఇజ్రాయెల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల బంధీల విడుదల తరువాత హమాస్ ఉగ్రవాదులతో తదుపరి సంధి చర్చలు విఫలమవడంతో ఇజ్రాయెల్ గాజాపై మళ్లీ బాంబు దాడులు ప్రారంభించింది. వాల్ స్ట్రీట్ జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాలోకి సొరంగ వ్యవస్థ ద్వారా మధ్యధరా సముద్రం నుంచి నీటిని పంప్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఒక పెద్ద పంపుల వ్యవస్థను సమీకరించింది. వీటి ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఉపయోగించే సొరంగాలలో భారీ ఎత్తున నీళ్లను వదిలి ఆటాక్ చేయాలని సన్నాహాలు చేస్తోంది. దీంతో సొరంగాల్లో దాక్కున్న ఉగ్రవాదులు బయటకు వస్తారని.. రహస్య ప్రదేశాలను ఛేదించొచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది.
అక్టోబరు 7న గాజా సరిహద్దు సమీపంలో ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడుల్లో దాదాపు 1,200 మంది మరణించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య భీకర పోరు జరుగుతోంది. గాజాలో దాక్కును ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే భూమి, వాయు మార్గంలో దాడులు చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. సొరంగాల్లో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు నీటిని పంపించి బయటకు రప్పించాలని యోచిస్తోంది. ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ప్రస్తుతం 137 మంది పురుషులు, మహిళలు, పిల్లలు, సైనికులు, విదేశీ పౌరులు గాజాలో ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్నారు. ఇజ్రాయెల్ అధికారులు ఇంకా మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నారు. చాలా మంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదు. ప్రస్తుతం బందీలందరినీ విడుదల చేయడానికి ముందు ఇజ్రాయెల్ నీటి పంపులను ఉపయోగించడాన్ని పరిశీలిస్తుందా అనేది స్పష్టంగా తెలియలేదు.
సొరంగాలలో బందీలను దాచిపెట్టినట్లు హమాస్ గతంలో చెప్పింది. ఇప్పుడు నీళ్లను వదిలితే బందీలు కూడా ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. ఈ ప్రణాళికపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అధికారి మాట్లాడేందుకు నిరాకరించారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. "హమాస్ ఉగ్రవాద సామర్థ్యాలను వివిధ మార్గాల్లో విచ్ఛిన్నం చేయడానికి ఐడీఎఫ్ సైనిక, సాంకేతిక సాధనాలు ఉపయోగిస్తోంది.." అని వెల్లడించింది. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలు చేయడం కోసం ఎంత సన్నిహితంగా ఉన్న అధికారులకు మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్లాన్ అమలు చేయడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.
Also Read: CM YS Jagan Mohan Reddy: ఏపీపై మిచౌంగ్ తుపాను భారీ ఎఫెక్ట్.. సీఎం జగన్ కీలక ప్రకటన
Also Read: Arvind Krishna: FIBA లీగ్‌లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా సినీ హీరో.. దుమ్ములేపుతున్నాడుగా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి