Israel PM Benjamin Netanyahu Gets Coronavirus Vaccine: న్యూఢిల్లీ: ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ( Israel ) శనివారం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేయించుకోని ఆదర్శంగా నిలిచారు. దీంతోపాటు ఆయన దేశంలో తొలిసారి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. అంతేకాకుండా ప్రపంచంలో తొలి టీకా తీసుకున్న ప్రధాన నాయకుల్లో ఒకరిగా నిలిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైజర్-బయోఎన్‌టెక్ (Pfizer/BioNTech vaccine)అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి ఇజ్రాయిల్ (Israel Govt) ప్రభుత్వం ఈ మధ్యనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో వ్యాక్సిన్ భయాన్ని పొగొట్టేలా.. అదేవిధంగా స్వతహగా వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి ముందుకొచ్చేలా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) మొదటి టీకాను తీసుకున్నారు. 


ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు (Coronavirus Vaccine) సంబంధించి 4 మిలియన్ల డోసులు ఇప్పటికే ఇజ్రాయిల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో శనివారం నుంచి దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ప్రధాని నెతన్యాహూ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌పై ప్రజలు భయాందోళనలను వీడి, ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో వ్యాక్సినేషన్ (vaccination) అనేది ముఖ్యమని.. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని పిలుపునిచ్చారు. Also read: Nepal: మరోసారి రాజకీయ సంక్షోభం.. పార్లమెంట్ రద్దుకు సిఫారసు


ఇజ్రాయిల్‌లో ఇప్పటివరకు 3 లక్షల 70 వేలకు పైగా కరోనా (Corona cases) కేసులు నమోదు కాగా.. 3వేలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్‌లలో (Covid-19 Vaccine) వ్యాక్సినేషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. Also read:Mount Everest height: ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook