కరోనా వ్యాక్సిన్ రెడీ..!!
`కరోనా వైరస్` ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తున్న వేళ అన్ని దేశాలు.. ఈ వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కునే పనిలో బిజీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు `వైరస్` మనుషులకు సోకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తున్న వేళ అన్ని దేశాలు.. ఈ వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కునే పనిలో బిజీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు 'వైరస్' మనుషులకు సోకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO చెబుతున్న దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 వ్యాక్సిన్ లు ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్నాయి. అందులో 7 నుంచి 8 వ్యాక్సిన్లు ఇప్పటికే జంతువులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఐతే అవి క్లినికల్ ట్రయల్స్ కోసం రావడానికి దాదాపు 2 నుంచి 3 నెలలు పడుతుందన్నారు.
మరోవైపు కరోనా మహమ్మారితో అత్యధికంగా దెబ్బతిన్న ఇటలీ మరో విషయం వెల్లడించింది. ప్రపంచంలో అందరి కంటే ముందుగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ను తమ పరిశోధకులు తయారు చేసినట్లు ఆ దేశానికి చెందిన మీడియా రిపోర్ట్ చేసింది. ఇటలీ రాజధాని రోమ్‌లోని ఇన్ఫెక్షన్ డిసీజ్ ఆస్పత్రి స్పాల్లంజనిలో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ఎలుకల్లో యాంటీబాడీలను అభివృద్ధి చేశాయని.. ఇవి మానవులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించడం విశేషం.
మరోవైపు ఇటలీలో కరోనా వైరస్ ఉద్ధృతంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 236 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అంతకు ముందు రోజు ఈ సంఖ్య 195గా ఉంది. మరోవైపు కొత్త పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. నిన్న వెయ్యి 75 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఐతే అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది కాస్త తక్కువ. సోమవారం రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 వందల 21గా ఉంది. మొత్తంగా ఇటలీలో కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 29 వేల 315 మంది బలయ్యారు. ప్రస్తుతం అక్కడ 2 లక్షల 13 వేల 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..