అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America president Donald Trump ) ను కరోనా వైరస్ ( Coronavirus ) గెలిపిస్తుందో ఓడిస్తుందో తెలియదు కానీ..న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ను మాత్రం మరోసారి గెలిపించేసింది. కరోనా వైరస్ కట్టడికి ఆమె చేసిన కృషి..విజయంలో  కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


న్యూజిలాండ్ ( New Zealand ) లో లేబర్ పార్టీ ( Labour party ) ఘన విజయం సాధిస్తోంది. సింగిల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తొలిపార్టీగా చరిత్ర సృష్టించనుంది. న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ ( Jacinda Ardern ) రెండోసారి విజయం సాధించారు. ఈమె విజయంలో కరోనా వైరస్ కట్టడికు తీసుకున్న చర్యలే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం, సమర్ధవంతమైన పాలన జెసిండా ఆర్డెర్న్ ను రెండోసారి ప్రదాని పీఠంపై కూర్చోబెడుతోందని అంటున్నారు.120 స్థానాలున్న న్యూజిలాండ్ పార్లమెంట్ లో ఇప్పటికే 64 స్థానాల్లో మెజార్టీతో దూసుకుపోతోంది.


రానున్న మూడేళ్లలో తన ముందు ప్రధానమైన సవాళ్లు ఉన్నాయని విజయానంతరం జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్దిక వ్యవస్థ పునర్నిర్మాణం, దేశంలో నెలకొన్న సామాజిక అసమానతలకు పరిష్కారం తనముందున్న మేజర్ హర్డిల్స్ అని చెప్పారు. దీనికోసం గతంలో కంటే మరింత ఎక్కువగా శ్రమించాల్సి వస్తుందన్నారు. ఈ విజయం కోవిడ్ 19 కట్టడిలో తమ ప్రభుత్వానికి ఓ ప్రజాభిప్రాయ సేకరణ లాంటిదని లేబర్ పార్టీ నేత తెలిపారు. 


జెసిండా ఆర్డెర్న్ ప్రాతినిధ్యం వహిస్తున్న లేబర్ పార్టీ 49 శాతానికి పైగా ఓట్ షేర్ సొంతం చేసుకుంది. 1930 తరువాత న్యూజిలాండ్ దేశ చరిత్రలో ఓ పార్టీకు లభించిన అతిపెద్ద ఓట్ షేర్ ఇదే. మరోవైపు ప్రతిపక్ష నేషనల్ పార్టీ ( National party ) కేవలం 27 శాతానికి పరిమితమైంది. జెసిండా ప్రజాదరణ, మానియాకు ఇదే నిదర్శనంగా తెలుస్తోంది. 80 ఏళ్ల న్యూజిలాండ్ ఎన్నికల చరిత్రలో ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. Also read: Vaccine and Shark: వ్యాక్సిన్ కోసం అన్ని లక్షల షార్క్ లు చావాల్సిందేనా