India ఆధిపత్యం కొనసాగించాలని ఆకాంక్షిస్తున్న Joe Biden ప్రభుత్వం, కీలక అంశాలపై చర్చ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో పోల్చితే జో బైడెన్ ప్రభుత్వం అమెరికా పౌరులతో పాటు ఇతర దేశాలకు తగినంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుండటం భారత్‌కు అనుకూలించనుంది.
ప్రపంచంలో ఆర్థిక శక్తులలో ఒకటైన భారత్‌కు అనుకూలమైన నిర్ణయాలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీసుకుంటోంది. ఇటీవల హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని హక్కులపై కీలక నిర్ణయం తీసుకున్న బైడెన్ తాజాగా భారత్‌కు మద్దతుగా వ్యవహరించారు. ఇండో, పసిఫిక్ ప్రాంతాల్లో ఆధిపత్య పోరులో ముందుకు సాగుతున్న అమెరికాకు భారత్ సైతం కీలక భాగస్వామి అని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ వేదికగా భారత్‌కు అనుకూలమైన వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేయడం ఇదే తొలిసారి. భారత్ లాంటి దేశాలతో స్నేహ, ఆర్థిక పరమైన సంబంధాలు చాలా కీలకం కానున్నాయిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) భావిస్తున్నారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెగ్ ప్రైస్ తెలిపారు. శాంతిని కాంక్షించే భారత్ లాంటి పెద్ద దేశాలతో సంబంధాలు మెరుగు చేసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
Also Read: Joe Biden Signatures: కీలక ఉత్తర్వులపై సంతకాలు, కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం ఇక అమలు
కాగా, మయన్మార్‌లో చైనా సైనిక తిరుగుబాటుకు సంబంధించి, అనంతరం చోటుచేసుకునే పరిణామాలపై అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకన్‌తో భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ఇటీవల ఫోన్లో చర్చించారు. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అమెరికా కంపెనీలు కేంద్రంగా ఉన్నాయని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ అంశం, ఇండో, పసిఫిక్ ప్రాంతంలో సహకారం లాంటి అంశాలపై ఇరుదేశాల ముఖ్య నేతలు చర్చలు జరిపారు.
Also Rad: H1B Visa: హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు Joe Biden భారీ ఊరట
అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఆ దేశంలో ఉన్న విదేశీయులను ఇరుకున పెట్టిన ట్రంప్ ప్రభుత్వంతో పోల్చితే జో బైడెన్ నుంచి మరిన్ని స్నేహపూర్వక సంబంధాలను భారత్ ఆకాంక్షిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, చేసిన చట్టాలపై సైతం జో బైడెన్ ప్రభుత్వం పరిశీలించి, మార్పులు చేర్పులకే సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.