అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల చెప్పినట్లుగానే కరోనా వ్యాక్సిన్‌ సోమవారం తీసుకున్నారు. డెలవర్‌లోని క్రిస్టియానా అసుపత్రిలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్నారు. బైడెన్ కరోనా టీకా తీసుకోవడాన్ని అమెరికా మీడియా ప్రత్యక్షప్రసారం చేసింది. కోవిడ్-19 టీకాపై ప్రజలలో అవగాహనా పెంచడంతో పాటు భయాందోళనను తొలగించేందుకు  తాను ఇందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా ప్రజలు సైతం కరోనా టీకా తీసుకునేందుకు సన్నద్ధమవ్వాలని జో బైడెన్ (Joe Biden) పిలుపునిచ్చారు. తాను సైతం ఫైజర్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తానని కరోనా టీకా తీసుకున్న అనంతరం జో బైడెన్ పేర్కొన్నారు. ఆయన సతీమణి జిల్ బైడెన్, జో బైడెన్ కన్నా ఒకరోజు ముందుగానే కరోనా టీకా తీసుకున్నారు. తాజాగా జో బైడెన్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటున్న సమయంలో ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆయన వెంటే ఉన్నారు.


Also Read: Ban On UK Flights: యూకేలో కొత్త వైరస్ కలకలం.. ఫ్లైట్ బ్యాన్ చేస్తున్న పలు దేశాలు



అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఫైజర్ వ్యాక్సిన్‌(Pfizer Vaccine)కు ఇటీవల అనుమతి ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం రోజు నుంచి అమెరికాలో కరోనా టీకాలను వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. కొందరు కీలక నేతలు, ప్రముఖులకు సైతం ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. కరోనా టీకా తీసుకోవడం హానికారకం కాదని తెలియజెప్పేందుకు జో బైడెన్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ప్రత్యక్షప్రసారం చేశారు. 


Also Read: Coronavirus Vaccine: ఆ దేశంలో తొలి వ్యాక్సిన్ ప్రధానికే..



కరోనా వ్యాక్సినేషన్ అనంతరం మీరు సైతం టీకా  తీసుకోవడానికి దేశ పౌరులు సిద్ధంగా ఉండాలని అమెరికన్లకు జో బైడెన్ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి తీవ్రతను అధికంగా దేశం అమెరికా అని తెలిసిందే. కరోనా వైరస్ ఆ దేశంలో 3 లక్షల 20 వేల మందిని కబలించింది. మిలియన్ల మంది కరోనా బారిన నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం సైతం కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది.


Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook