Ban On UK Flights: యూకేలో కొత్త వైరస్ కలకలం.. ఫ్లైట్ బ్యాన్ చేస్తున్న పలు దేశాలు

Nations impose UK travel bans over new variant : కొత్త రకం వైరస్ యూరప్ దేశాలను వణికిస్తోంది. బ్రిటన్‌ సహా ఆఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. తద్వారా కరోనా వైరస్‌తో పాటు కొత్త వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి.

Last Updated : Dec 21, 2020, 09:27 AM IST
Ban On UK Flights: యూకేలో కొత్త వైరస్ కలకలం.. ఫ్లైట్ బ్యాన్ చేస్తున్న పలు దేశాలు

Ban On UK Flights: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏడాది నుంచి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పోరాడుతుంటే ప్రస్తుతం మరో సమస్య వచ్చి పడింది. కొత్త రకం వైరస్ యూరప్ దేశాలను వణికిస్తోంది. బ్రిటన్‌ సహా ఆఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. తద్వారా కరోనా వైరస్‌తో పాటు కొత్త వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి.

కరోనా వైరస్‌ (CoronaVirus)తో సతమవుతుంటే మరో వైరస్‌ను ఎదుర్కొనే ధైర్యం చేయడం కన్నా ముందు జాగ్రత్త చర్యలే మేలు అని నెదర్లాండ్‌, బెల్జియం దేశాలు దక్షిణాఫ్రికా, బ్రిటన్ దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించడం తెలిసిందే. తాజాగా జర్మనీ దేశం ఆ రెండు దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించడానికి సిద్ధంగా ఉంది. ఉన్నతస్థాయి సమావేశం కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ తమ వద్ద కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు సంబందించిన కేసులు నమోదు కాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: AP: కరోనా చక్కబడ్డాకే స్థానిక సంస్థల ఎన్నికలు

బ్రిటన్‌లో తాజాగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ స్ట్రెయిన్‌ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం తెలిసిందే. బ్రిటన్ (UK) ప్రధాని బోరిస్ జాన్సన్ దీనిపై స్పందించారు. కొత్త రకం వైరస్ 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే దీనివల్ల ఎంత మేర ముప్పు ఉందనే విషయంపై నిపుణులు పరిశీలిస్తున్నారని చెప్పారు.

Also Read: SBI Cuts Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు

కరోనా వైరస్ స్ట్రెయిన్ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు మరికొన్ని గంటల్లో బ్రిటన్ కేబినెట్ భేటీ కానుంది. ఇదివరకే పలు దేశాలు బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించారని బ్రిటన్ ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్ హెన్‌కాక్ పేర్కొన్నారు. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Also Read: Health tips: శీతాకాలంలో డయాబెటిస్ పేషెంట్స్ ఇవి తింటే రిస్కే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News