Joe Biden says US is committed to defending Taiwan against China : చైనా.. తైవాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనా (China) దాడికి దిగితే.. తైవాన్‌ను (Taiwan) తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జో బైడెన్‌ అన్నారు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలిటరీ దేశం అని చైనా, రష్యా (Russia) సహా ఇతర దేశాలకూ తెలుసని ఆయన పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Salmonella outbreak: అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న ఉల్లిపాయ..సాల్మొనెల్లా వ్యాధి వ్యాప్తి


మరోవైపు తైవాన్‌ (Taiwan) విషయంలో అమెరికా పాలసీల్లో ఎలాంటి మార్పులు ఉండవని వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. తైవాన్‌ (Taiwan) విషయంలో చైనా కొన్నాళ్లుగా దుందుడుకు ధోరణి కొనసాగిస్తోంది. తైవాన్‌ తమ దేశంలో భాగం అంటూ దాన్ని స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. 


తాజాగా తైవాన్‌ గగనతలంలోకి ఏకంగా 52 యుద్ధ విమానాలను పంపించింది చైనా (China). కొన్నాళ్లుగా తైవాన్ విషయంలో చైనా ఇదే తరహాలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అంతేకాదు.. తైవాన్‌.. చైనాలను ఏకం చేసి తీరతామంటూ తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తైవాన్‌కు అండగా చైనా నిలిచింది.


Also Read : Xiaomi Redmi Note 11 Pro specs: షావోమి నుంచి రెడ్‌మి నోట్ 11 ప్రో సిరీస్ మొబైల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి