Kabul: బస్టాండ్ ను తలపిస్తున్న కాబూల్ ఎయిర్ పోర్టు...విమానాలు ఎక్కేందుకు ఎగబడుతున్న జనాలు..వీడియో వైరల్!
Kabul Airport: కాబూల్ సరిహద్దులన్నీ దాదాపు మూసుకుపోయాయి. దీంతో కాబూల్ నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కేవలం విమాన మార్గమే దిక్కు. జనాలతో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోయింది.
Kabul Airport: మనదేశంలో లాక్ డౌన్ అనగానే...బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతాయి.. ప్రజలు వాహనాలు ఎక్కేందుకు ఎగబడతారు. కానీ విమానం ఎక్కేందుకు ఎగబడటం చూశారా?..కానీ ప్రస్తుత అఫ్గానిస్థాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిస్థితి అలానే ఉంది. వందల మంది ప్రజలు దేశం వీడేందుకు ఏకంగా విమానాల వద్దకే పరుగులు తీస్తున్నారు.
దేశం మెుత్తం తాలిబన్ల(Talibans) చేతుల్లోకి వెళ్లిపోయింది. సైన్యం చేతులెత్తేసింది. అధ్యక్షుడు రాజీనామా చేసి మరో దేశానికి పారిపోయారు. దీంతో అఫ్ఘన్ల(Afghanistan) పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తాలిబన్ల(Talibans) రాజ్యంలో ఉండలేమంటూ వేల మంది దేశాన్ని విడిచేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగానే సోమవారం ఉదయం కాబూల్ ఎయిర్‌పోర్ట్(Kabul Airport)కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అక్కడ ఉన్న ఒక్క విమానంలోకే ఎక్కడానికి వేల మంది ఎగబడ్డారు.
Also Read: Afghanistan: ఆఫ్ఘన్‌పై తాలిబన్ల ఆధిపత్యం, త్వరలోనే అధికారిక ప్రకటన
కాబుల్‌ను తాలిబన్లు(Talibans) చుట్టుముట్టారన్న వార్త తెలియగానే నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల బాటపట్టారు. దీంతో హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Hamid Karzai International Airport)లోని పౌర టెర్మినల్ కిక్కిరిసిపోయింది. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇప్పటికే పాకిస్థాన్ తమ సరిహద్దులను మూసేసింది. ఎయిర్ ఇండియా(Air india) విమానం 129 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి దిల్లీకి చేరుకొంది. మరోపక్క కాబుల్ నుంచి దిల్లీ(Delhi)కి వరుసగా విమానాలను నడిపేందుకు ఎయిర్ ఇండియా సిబ్బందిని సిద్ధం చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook