Kerala Fishermen Case: దేశ వ్యాప్తంగా తొమ్మిదేళ్ల కిందట సంచలనం రేపిన కేరళ జాలర్ల హత్య కేసులను సుప్రీంకోర్టు మంగళవారం మూసివేసింది. కేరళ మత్స్యకారులను హత్య చేశారని ఇద్దరు ఇటలీ నావికులు భారత్‌లో ఎదుర్కొంటున్న అన్ని కేసులను కొట్టివేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళలో 2012లో ఇద్దరు మత్స్యకారులు కేరళ తీరంలో చేపలవేటకు వెళ్లగా ఇటలీ నావికా సిబ్బంది సాల్వటోర్ గిరోండే, మాసిమిలియానో లాటోర్రెలు వారిని తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసు తాజాగా విచారణకు రాగా జస్టిస్ ఇందిరా బెనర్జీ మరియు జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం అన్ని విషయాలు పరిశీలించారు. హత్యకు గురైన ఇద్దరు జాలర్లకు, బోటు సిబ్బందికిగానూ రూ.10 కోట్ల మేర పరిహారాన్ని ఇటలీ ప్రభుత్వం చెల్లించింది. గతంలో కేరళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు ఇటలీ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నగదు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)కు జమ చేసింది. 


 Also Read: Rythu Bandhu Scheme: నేటి నుంచి పది రోజుల వరకు రైతుబంధు సాయం, ఖాతాల్లోకి రూ.5 వేలు


ఈ క్రమంలో ఇటలీ నుంచి నష్టపరిహారం అందడంతో నావికా సిబ్బందిపై భారత్‌లో నమోదైన అన్ని కేసులను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. కేసులు మూసివేయడానికి ఇది తగిన సమయం అని ప్రస్తావిస్తూ పరిహారం కేరళ హైకోర్టుకు బదలాయించారు. బాధితులు ఒక్కో కుటుంబానికి రూ.4 కోట్ల మేర పరిహారం అందించాలని, మిగతా నగదుకు బోటు యజమానికి అందించాలని కేరళ(Kerala) హైకోర్టు గతంలోనే తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ జలాల మధ్యవర్తిత్వ నిబంధనల ప్రకారం కేసు కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. 


Also Read: Delta Plus Variant: ఇండియాలో COVID-19 కొత్త వేరియంట్, దీని ప్రభావం వివరాలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook