Supreme Court: హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సీనియర్ న్యాయవాదులకు అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ ఏమంటున్నారు ఈ విషయంలో..
హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో సీనియర్ న్యాయవాదుల్ని ముఖ్యంగా సుప్రీంకోర్టులో పనిచేస్తున్నవారిని పరిగణలో తీసుకోవాలనే విజ్ఞప్తి చాలాకాలంగా విన్పిస్తోంది. ఇప్పుడీ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు (Supreme Court) ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ రాసిన లేఖ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న న్యాయవాదుల అనుభవాన్ని, నైపుణ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తుల భర్తీలో పరిగణలో తీసుకోవాలంటూ ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ (Supreme Court CJ Justice NV Ramana) హైకోర్టు న్యాయమూర్తులకు లేఖ రాశారు. హైకోర్టు న్యాయమూర్తుల భర్తీలో సుప్రీంకోర్టు ప్రాక్టీసింగ్ లాయర్లను పరిగణలో తీసుకోవల్సిందిగా కోరారు.
హైకోర్టు (High court) న్యాయమూర్తులుగా నియామకం కోసం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల్ని పరిగణలో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సీజేఐకు రాసిన లేఖ ప్రకారం ఈ చర్య తీసుకుంటున్నట్టు ఎస్‌సిబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ తెలిపారు. తాము చేసిన అభ్యర్ధనను సీజేఐ అంగీకరించారని చెప్పారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదుల్ని హైకోర్టుకు ఎలెవేషన్ కోసం పరిగణించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని విజ్ఞప్తి చేశారు.
Also read: Pradhan Mantri Garib Kalyan Anna Yojna: 80 కోట్ల మంది ప్రజలకు దీపావళి వరకు ఉచితం: PM Modi
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook