US Elections: ఈసారి హిందూ ఓటుబ్యాంకు ఎటు?
ప్రపంచం మొత్తం అమెరికా ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న 20 లక్షల మంది హిందూ ఓట్లే కీలకంగా మారనున్నాయి. ఈ ఓటు బ్యాంకు ఇప్పుడు ఎటువైపు ఉంది ?
ప్రపంచం మొత్తం అమెరికా ఎన్నికల ( America elections ) పై దృష్టి సారిస్తోంది. యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న 20 లక్షల మంది హిందూ ఓట్లే కీలకంగా మారనున్నాయి. ఈ ఓటు బ్యాంకు ఇప్పుడు ఎటువైపు ఉంది ?
అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ( Republican party ) నుంచి మరోసారి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) బరిలో ఉండగా..డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) నుంచి జో బిడెన్ ( Joe bidden ) అభ్యర్ధిగా ఉన్నారు. అటు ఇదే పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ బరిలో ఉన్నారు. ఈ నేపధ్యంలో అమెరికా ఎన్నికల్లో హిందూ ఓట్లు కీలకంగా మారనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దాదాపు 20 లక్షల మంది వరకూ హిందూ ఓటర్లున్నారు ( 20 lakhs of hindu vote bank ) . ఫ్లోరిడా, వర్జీనియా, పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిస్...వంటి పలు రాష్ట్రాల్లో హిందూ ఓటు బ్యాంకు కీలకంగా ఉంది. అధ్యక్ష ఎన్నికల్ని ప్రబావితం చేసే స్వింగ్ స్టేట్స్ లో హిందూ ఓటు బ్యాంకు ముఖ్యమైందని అంటున్నారు డెమోక్రటిక్ పార్టీ నేత కృష్ణమూర్తి. జో బిడెన్, కమాలా హ్యారిస్ ( kamala harris ) ద్వయానికే హిందూవులంతా ఓట్లేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. వసుదైక కుటుంబ భావనను దృష్టిలో ఉంచుకుని ఓట్లేయాలని కోరుతున్నారు. ట్రంప్ పాలనలో హిందూవులపై విద్వేషం మూడు రెట్లు పెరిగిందని గుర్తు చేస్తున్నారు. కెంటకీలో స్వామి నారాయాణ్ గుడి వద్ద జరిగిన విధ్వంసాన్ని ప్రచారాస్త్రంగా మల్చుకుంటున్నారు. జో బిడెన్ మాట నిలబెట్టుకునే మనిషని..సమానత్వాన్ని విశ్వసిస్తాడని చెబుతున్నారు.
మరోవైపు ఇదే హిందూ ఓటు బ్యాంకు కోసం రిపబ్లికన్ పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ( Indian prime minister narendra modi ) తో ఉన్న సాన్నిహిత్యం తమకు ఉపయోగపడుతుందనేది రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి..ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ఆలోచనగా ఉంది. ఏదేమైనా రెండుపార్టీలు హిందూ అమెరికన్ల మద్దతును కోరడం మాత్రం అమెరికా ఎన్నికల్లో ఇదే తొలిసారి. ఎవరికివారే తామే హిందూవుల హక్కుల పరిరక్షకులమని చెప్పుకుంటున్నారు. Also read: Indo-China Dispute: మాస్కో వేదికగా రాజకీయ అత్యన్నత స్థాయి భేటీ